Bucket : ఏంటి.. ఈ బ‌కెట్ ధ‌ర రూ.26వేలా..? కామెడీ గానీ చేయ‌డం లేదు క‌దా..!

May 24, 2022 9:01 PM

Bucket : మ‌నం ఇంట్లో వాడే ప్లాస్టిక్ బ‌కెట్‌ల ఖ‌రీదు ఎంత ఉంటుంది ? మ‌హా అయితే రూ.200 నుంచి రూ.400 వ‌ర‌కు ఉంటుంది. చిన్నవి అయితే రూ.100 లోపే ల‌భిస్తాయి. అయితే ఆ బ‌కెట్ ధ‌ర ఎంతో తెలుసా ? అక్ష‌రాలా రూ.26వేలు. అవును. న‌మ్మ‌లేకున్నా ఇది నిజ‌మే. ఓ సాధార‌ణ ప్లాస్టిక్ బ‌కెట్‌ను ఏకంగా రూ.26వేల‌కు విక్ర‌యిస్తున్నారు. అయితే దాని అస‌లు ధ‌ర రూ.35,900 అట‌. దానిపై 28 శాతం డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు. దీంతో బ‌కెట్ ధర‌ను రూ.25,999గా నిర్ణ‌యించారు. ఇక ఈ బ‌కెట్‌ను అమెజాన్ లో విక్ర‌యిస్తున్నారు.

అమెజాన్ లో విక్ర‌యించ‌బ‌డుతున్న ఈ పింక్ క‌ల‌ర్ ప్లాస్టిక్ బ‌కెట్ విష‌యం ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. దీనికి నో కాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా ల‌భిస్తోంది. నెల‌కు రూ.1224 ఈఎంఐ చెల్లించి ఈ బ‌కెట్‌ను నెల‌స‌రి వాయిదాల ప‌ద్ధ‌తిలో కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే అంత‌టి ధ‌ర ఉన్న‌ప్ప‌టికీ ఇప్పుడీ బ‌కెట్ గురించి వెదికితే అందులో దొర‌క‌డం లేదు. నో స్టాక్ అని ద‌ర్శ‌న‌మిస్తోంది. అంటే.. అంత‌టి ధ‌ర పెట్టి మ‌రీ ఆ బ‌కెట్‌ను ఎవ‌రో కొని ఉంటార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. దాన్ని కొన్న అభాగ్యుడు ఎవ‌ర‌బ్బా.. అని నెటిజ‌న్లు ఆలోచిస్తున్నారు.

do you know how much the cost of this Bucket is
Bucket

ఇక ఈ విష‌యంపై నెటిజ‌న్లు అనేక ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు. మా దగ్గ‌రికి వ‌స్తే రూ.26వేల‌కు ఎన్ని కావాలంటే అన్ని బ‌కెట్ల‌ను ఇస్తాం.. అస‌లు అంత‌టి ధ‌ర పెట్టి ఆ బ‌కెట్‌ను కొన్న వ్య‌క్తి ఎవ‌రు.. బ‌కెట్ ధ‌ర ఇంత‌లా కూడా ఉంటుందా.. అని నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment