Malavika Mohanan : మాళ‌విక మోహ‌న‌న్‌కు నెటిజ‌న్ కొంటె ప్ర‌శ్న‌.. దిమ్మ‌తిరిగిపోయేలా రిప్లై ఇచ్చిన బ్యూటీ..!

May 23, 2022 2:35 PM

Malavika Mohanan : మాళ‌విక మోహ‌న‌న్.. ఈ అమ్మడు తెలుగులో అస‌లు సినిమాలు ఒక్క‌టి కూడా చేయ‌లేదు. అయిన‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ ముద్దుగుమ్మ గురించి బాగానే తెలుసు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో ఈమె చేసే గ్లామ‌ర్ షో అంతా ఇంతా కాదు. ఎల్ల‌ప్పుడూ ఈమె అందులో త‌న అందాల ఆర‌బోత ఫొటోల‌ను షేర్ చేస్తూనే ఉంటుంది. అలా ఈమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా తెలుసు. ఈమె సినిమాల్లోకి రాకముందు మోడ‌ల్‌. క‌నుక స్వ‌త‌హాగానే త‌ర‌చూ ఫొటోషూట్స్ చేస్తూ అల‌రిస్తుంటుంది. అయితే మాళ‌విక మోహ‌న‌న్ను ఓ నెటిజ‌న్ కొంటె ప్ర‌శ్న అడిగాడు. అందుకు ఆమె కూడా దీటుగా స‌మాధానం చెప్పింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

మాళ‌విక మోహ‌న‌న్ ఇటీవ‌ల ట్విట్ట‌ర్‌లో ఓ క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ సెష‌న్ నిర్వ‌హించింది. త‌న ఫాలోవర్ల‌తోపాటు అభిమానులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానాలు చెప్పింది. ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ ఆమెను కొంటె ప్ర‌శ్న అడిగాడు. ఆమె ఇటీవ‌ల ధ‌నుష్‌తో క‌లిసి మార‌న్ అనే త‌మిళ సినిమాలో న‌టించిన విష‌యం విదిత‌మే. అందులో ధ‌నుష్‌, మాళ‌విక‌ల మ‌ధ్య ఓ బెడ్ సీన్ ఉంటుంది. అయితే ఈ సీన్ కోసం ఎన్ని టేక్స్ తీసుకున్నారు ? ఎన్నిసార్లు చేస్తే ఈ సీన్ చ‌క్క‌గా వ‌చ్చింది ? అంటూ అత‌ను ప్రశ్న అడిగాడు.

netizen question to Malavika Mohanan she has given reply
Malavika Mohanan

అయితే ఇందుకు మాళ‌విక మోహ‌న‌న్ కూడా దీటుగానే రిప్లై ఇచ్చింది. నీ త‌ల‌లో ఏదో పాడైన‌ట్లుంది.. అంటూ మాళ‌విక ఆ నెటిజ‌న్ కు దిమ్మ తిరిగేలా రిప్లై ఇచ్చింది. ఇక ఆమె పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మాళ‌విక మోహ‌న‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌మిళ సినిమాల్లోనే న‌టించింది. తెలుగులో సినిమాలు చేయ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే ప్ర‌భాస్‌, మారుతిల కాంబినేష‌న్‌లో రానున్న సినిమాలో ఈమె న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment