Rajasekhar : చిరంజీవి గురించి అసలు విష‌యం బ‌య‌ట పెట్టిన రాజ‌శేఖ‌ర్‌..!

May 17, 2022 5:36 PM

Rajasekhar : న‌టుడు రాజ‌శేఖ‌ర్ ఈమ‌ధ్య కాలంలో సినిమాల్లో అంత బాగా ఏమీ క‌నిపించ‌డం లేదు. ఈయ‌న ఎప్పుడో ఒక‌టి, రెండు సినిమాలు తీస్తూ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈయ‌న త‌క్కువ సినిమాలు చేస్తున్న‌ప్ప‌టికీ ఆయ‌న న‌టిస్తున్న సినిమాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ఈయ‌న తాజాగా న‌టించిన శేఖ‌ర్ చిత్రం ఈ నెల 20వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌లే రాజ‌శేఖ‌ర్ భార్య జీవిత మూవీ విడుద‌ల సంద‌ర్భంగా మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇక ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ స్వ‌యంగా మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ఏం మాట్లాడారు.. అనేది ఆయ‌న మాట‌ల్లోనే చూద్దాం..

నాకు చాలా సుల‌భంగా కోపం వ‌స్తుంది. ఎవ‌రు క‌రెక్ట్ గా లేక‌పోయినా మాట్లాడ‌తా. ఆ సంద‌ర్బంలో గొడ‌వ జ‌రుగుతుంది. క‌నుక న‌న్ను కోపిష్టి అనుకుంటారు. నేను ఏది ఉన్నా ముఖం మీదే నేరుగా చెప్పేస్తా. ముక్కు సూటిగా వెళ్తా. అందుక‌నే నేనంటే కొంద‌రు ఇష్ట‌ప‌డ‌రు. నా మీద నా భార్య జీవిత ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. నిర్ణ‌యాలు అన్నీ నేనే తీసుకుంటా. కానీ ఆమె అమ‌లు చేస్తుంది. దీని వ‌ల్ల ఆమె నాపై డామినేష‌న్ చెలాయిస్తుంద‌ని అంద‌రూ అనుకుంటారు. అది నిజం కాదు.

Rajasekhar told real truth about Chiranjeevi
Rajasekhar

క‌థల విష‌యానికి వ‌స్తే.. జీవిత‌కే ఆ విష‌యం విడిచిపెడ‌తా. ఆమెకు న‌చ్చిన క‌థ‌ల‌ను వింటా. చిరంజీవి గారితో నాకు చాలా సాన్నిహిత్యం ఉంది. అంద‌రూ మేము గొడ‌వ‌ప‌డ‌తాము.. అనుకుంటారు. అలాంటిదేమీ లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న‌ను నేను, జీవిత క‌లుస్తూనే ఉంటాం. ఆయ‌న‌తో మాట్లాడుతున్నాం. మా మ‌ధ్య రిలేష‌న్ కూడా బాగానే ఉంది.. అని రాజ‌శేఖ‌ర్ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment