Pawan Kalyan : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌ల‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్ర‌హం..!

May 16, 2022 5:49 PM

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, భూమిక‌లు హీరో హీరోయిన్లుగా 2001లో వ‌చ్చిన ఖుషి చిత్రం అప్ప‌ట్లో ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎస్‌జే సూర్య తెర‌కెక్కించిన ఈ చిత్రం అప్ప‌ట్లో ఘ‌న విజ‌యం సాధించింది. ఇందులోని పాటలు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించిన ఈ మూవీ పాట‌లు అంటే ప్రేక్ష‌కులు ఇప్ప‌టికీ ఆస‌క్తిగా వింటూనే ఉంటారు. ఇక ఈ మూవీ ప‌వ‌న్ కెరీర్‌లోని అత్యుత్త‌మ చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. అయితే ఇదే మూవీ టైటిల్‌తో విజ‌య్ దేవ‌ర కొండ‌, స‌మంత హీరో హీరోయిన్లుగా తాజాగా ఒక చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను తాజాగా విడుద‌ల చేశారు. అయితే ప‌వ‌న్ చిత్ర టైటిల్ ను వాడుకోవ‌డ‌మే కాక‌.. ఆ చిత్రాన్ని అవ‌మాన‌ప‌రిచేలా విజ‌య్‌, స‌మంత‌లు వ్య‌వ‌హ‌రించారంటూ.. ప‌వ‌న్ ఫ్యాన్స్ వారిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం.. ఖుషి. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఆర్మీ, మంచు కొండ‌లు ఉంటాయి. దీంతో ప్రేమ క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌తుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ ఫ‌స్ట్ లుక్‌లో విజ‌య్‌, స‌మంత చూసేందుకు ఎబ్బెట్టుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య్, స‌మంతలు ప‌వ‌న్ సినిమా టైటిల్‌ను వాడుకోవ‌డ‌మే కాక‌.. అంత‌టి గొప్ప చిత్రాన్ని అవ‌మాన ప‌రిచేలా దుస్తులు ధ‌రించార‌ని.. ఫ‌స్ట్ లుక్ అస‌లు ఏమీ బాగాలేద‌ని.. ఆరోపిస్తూ ప‌వ‌న్ ఫ్యాన్స్ వారిపై మండిప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Pawan Kalyan fans angry on Vijay Devarakonda and Samantha
Pawan Kalyan

ఇక విజ‌య్‌, స‌మంత‌ల ఖుషి చిత్రాన్ని.. నిన్ను కోరి, మ‌జిలీ సినిమాల ఫేమ్ శివ నిర్వాణ తెర‌కెక్కిస్తుండ‌గా.. దీన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. డిసెంబ‌ర్ 23వ తేదీన ఈ మూవీ విడుద‌ల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment