Devi Nagavalli : వామ్మో.. ఏంద‌య్యా ఇది.. ఎప్పుడూ చూడ‌లే..!

May 16, 2022 2:50 PM

Devi Nagavalli : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వ‌చ్చింద‌న్న చందంగా మారింది.. యాంక‌ర్ దేవీ నాగ‌వ‌ల్లి ప‌రిస్థితి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఆమె విశ్వ‌క్‌సేన్‌తో వివాదంలో చిక్కుకుంది. ఓ న‌టున్ని స్టూడియోకు పిలిచి మ‌రీ అవ‌మానించార‌ని ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెటిజ‌న్లు అంద‌రూ విశ్వ‌క్‌కే త‌మ స‌పోర్ట్ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఈ గొడ‌వ కాస్త స‌ద్దుమ‌ణిగింది. అయిన‌ప్ప‌టికీ దేవి నాగ‌వ‌ల్లికి మాత్రం విమ‌ర్శ‌లు, కౌంట‌ర్లు, ట్రోల్స్ ఎదుర‌వుతూనే ఉన్నాయి. ఇక తాజాగా త‌న‌ది కాని గొడ‌వ‌లోనూ ఆమె చిక్క‌కుంది. దీంతో మ‌రోమారు నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ న‌టించిన స‌ర్కారు వారి పాట చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అద్భుతమైన విజ‌యంతో దూసుకుపోతోంది. ఈ మూవీ 3 రోజుల్లోనే రూ.112 కోట్ల‌కు పైగా గ్రాస్ సాధించింది. అయితే సినిమా హిట్ అవ‌డంతో మ‌హేష్ ఫ్యాన్స్ సంబురాలు జరుపుకుంటున్నారు. త‌మ అభిమాన హీరో హ్యాట్రిక్ విజ‌యాన్ని సాధించాడ‌ని అంటున్నారు. అయితే ఓ చాన‌ల్ మాత్రం స‌ర్కారు వారి పాట‌పై నెగెటివ్ కామెంట్స్ చేసింది. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ ఆ చాన‌ల్‌ను బండ బూతులు తిడుతున్నారు.

Mahesh Babu fans troll Devi Nagavalli
Devi Nagavalli

మ‌హేష్ ఫ్యాన్స్ ప్ర‌స్తుతం ఆ చాన‌ల్‌ను తిట్టిపోస్తున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా చెప్ప‌లేని ఓ బూతుతో కూడిన హ్యాష్ ట్యాగ్‌ను కూడా ర‌న్ చేస్తున్నారు. అయితే స‌ద‌రు చాన‌ల్ వారు స‌ర్కారు వారి పాట గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నా స‌రే.. వారు మ‌హేష్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేన‌ని అంటున్నారు. అయితే ఈ గొడ‌వ‌లోకి స‌ద‌రు చాన‌ల్ యాంక‌ర్ దేవి నాగ‌వ‌ల్లిని కూడా లాగారు. ఆమెకు చెందిన పాత ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి మ‌హేష్ ఫ్యాన్స్ వాటిని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప‌నిలో ప‌నిగా ఆ చాన‌ల్‌తోపాటు ఆమెను కూడా తిడుతూ ట్రోల్ చేస్తున్నారు.

అయితే అస‌లు దీనికి, ఆమెకు సంబంధం లేదు. కానీ ఇటీవ‌ల ఆమె చిక్క‌కున్న వివాదం కార‌ణంగా.. ఆమె ఆ చాన‌ల్‌లోనే ప‌నిచేస్తున్న కార‌ణంగా.. ఆమెను కూడా మ‌హేష్ ఫ్యాన్స్ ఈ వివాదంలోకి లాగారు. దీంతో ఆమెను కూడా మ‌ళ్లీ ట్రోల్ చేస్తూ.. విమ‌ర్శిస్తున్నారు. అయితే ఇది ఎంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment