Chiranjeevi : ఆచార్య ఎఫెక్ట్‌..? సినిమా క‌థ విష‌యంలో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని.. చిరు నిర్ణ‌యం..?

May 15, 2022 12:34 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లు తొలిసారిగా పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర‌ల్లో ఆచార్య సినిమా ద్వారా క‌నిపించారు. ఈ మూవీ ఏప్రిల్ 29వ తేదీన రిలీజ్ అయింది. అయితే భారీ న‌ష్టాల‌ను చ‌విచూసింది. చిరంజీవి కెరీర్‌లో అత్యంత దారుణ‌మైన ఫ్లాప్‌ను మూటగ‌ట్టుకున్న సినిమాల్లో ఇదొకటిగా మారింది. ఈ క్ర‌మంలోనే సినిమాకు దాదాపుగా రూ.84 కోట్ల మేర న‌ష్టం వచ్చింద‌ని అంటున్నారు. న‌ష్టాల‌ను చ‌ర‌ణ్ భరిస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆచార్య ఫెయిల్ అవ్వ‌డం వెనుక ఎన్ని కార‌ణాలు ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌ధానంగా చిరంజీవి ఈ సినిమా క‌థ విష‌యంలో క‌ల‌గ‌జేసుకున్నార‌ని.. క‌నుక‌నే ఫెయిల్ అయింద‌ని అంటున్నారు. ద‌ర్శ‌కుడికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వ‌లేద‌ని.. చిరంజీవి క‌థ‌లో మార్పులు చేయించార‌ని.. క‌నుక‌నే సినిమా ఫ్లాప్ అయింద‌ని అంటున్నారు.

చిరంజీవి పాత త‌రానికి చెందిన ఐడియాల‌ను ఈ సినిమా క‌థ‌లో జొప్పించార‌ని.. ఆయ‌న క‌థ‌కు మార్పులు చేశార‌ని స‌మాచారం. క‌నుక‌నే ద‌ర్శ‌కుడు కొరటాల శివ కూడా ఈ విష‌యంలో అసంతృప్తిగా ఉన్న‌ట్లు తెలిసింది. అయితే చిరంజీవి ఐడియాలు మంచివే. కానీ ఇప్ప‌టి త‌రానికి అనుగుణంగా అవి ఉండ‌వు. ఇప్పుడు కొత్త కొత్త ద‌ర్శ‌కులు కొత్త ఐడియాల‌తో ఇప్ప‌టి త‌రాన్ని ఆక‌ట్టుకునే విధంగా క‌థ‌ల‌ను రూపొందిస్తున్నారు. క‌నుక ఆ స్వేచ్ఛ‌ను ద‌ర్శ‌కుడికే ఇచ్చి ఉంటే బాగుండేద‌ని.. అప్పుడు ఆచార్య క‌థ మోడ్ర‌న్‌గా ఉండేద‌ని.. అది ఇప్ప‌టి త‌రానికి క‌నెక్ట్ అయి ఉండేదని.. దీంతో సినిమా అంత‌గా ఫ్లాప్ కాకుండా.. క‌నీసం యావ‌రేజ్ టాక్‌ను అయినా సొంతం చేసుకుని ఉండేద‌ని.. అంటున్నారు.

Chiranjeevi reportedly decided to not to involve in movie stories
Chiranjeevi

అయితే సినిమా క‌థ‌లో వేలు పెట్ట‌డం వ‌ల్లే ఇలా జ‌రిగి ఉంటుంద‌ని కూడా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఇక‌పై సినిమాల క‌థ‌ల విష‌యంలో ద‌ర్శ‌కులు, ర‌చయిత‌ల‌కు స్వేచ్ఛ‌ను ఇవ్వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఇదే విష‌యానికి చిరంజీవి ఆమోదం తెలిపిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ఇక‌పై క‌థ‌ల విష‌యంలో జోక్యం చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు సమాచారం. క‌థ‌, డైలాగ్స్, ద‌ర్శ‌క‌త్వం వంటి అంశాల్లో ఇక‌పై క‌ల‌గ‌జేసుకోకూడ‌ద‌ని చిరు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే ఆయ‌న ప్ర‌స్తుతం న‌టిస్తున్న భోళా శంక‌ర్‌, గాడ్ ఫాద‌ర్‌ల‌తోపాటు త్వ‌ర‌లో తెర‌కెక్క‌నున్న వాల్తేరు వీర‌య్య సినిమా విష‌యంలోనూ ఇక‌పై జోక్యం చేసుకోబోన‌ని అంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఆగ‌స్టులో చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌తో రానున్నారు. మ‌రి ఆ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment