Tamannaah : వారెవ్వా.. త‌మ‌న్నా అందం.. అదిరిపోయింది.. ఏముందిరా బాబూ..!

May 11, 2022 8:49 PM

Tamannaah : టాలీవుడ్‌కు త‌మ‌న్నా వ‌చ్చి దాదాపుగా 15 ఏళ్ల‌కు పైనే అవుతోంది. అయిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డికి అవ‌కాశాల‌కు మాత్రం కొదువ ఉండ‌డం లేదు. తాజాగా ఈమె న‌టించిన ఎఫ్3 మూవీ విడుద‌ల కానుంది. దీంతో ఈమె చేస్తున్న సంద‌డి అంతా ఇంతా కాదు. సోష‌ల్ మీడియాలోనూ త‌మన్నా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో ఆమె అందులో షేర్ చేస్తున్న ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ‌లే బ్లూ క‌ల‌ర్ డ్రెస్‌లో ఈ ముద్దుగుమ్మ అల‌రించ‌గా.. ఇప్పుడు మళ్లీ డార్క్ రెడ్ క‌ల‌ర్ డ్రెస్‌లో హొయ‌లు పోయింది. ఎఫ్3 మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఈమె చేసిన అందాల ప్ర‌ద‌ర్శ‌న మ‌తులు పోగొడుతోంది.

Tamannaah in F3 movie promotion program
Tamannaah

త‌మ‌న్నా ఆ భాష.. ఈ భాష అని లేదు.. అన్ని భాష‌ల‌కు చెందిన సినిమాల్లోనూ న‌టించింది. ఈమె బాహుబ‌లి మూవీలో అవంతిక‌గా ఆక‌ట్టుకుంది. దీంతో బాలీవుడ్‌లోనూ అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. ఇక నితిన్ తో క‌లిసి మ్యాస్ట్రో సినిమాలో నెగెటివ్ రోల్ చేసింది. అయిన‌ప్ప‌టికీ ఈ అమ్మ‌డి న‌ట‌న‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక భోళా శంక‌ర్ మూవీలో ఏకంగా మెగాస్టార్ ప‌క్క‌న న‌టించే చాన్స్‌ను కొట్టేసింది. సినిమా ఇండ‌స్ట్రీలో ఒక హీరోయ‌న్ ఇన్ని సంవ‌త్స‌రాల నుంచి నిల‌దొక్కుకోవ‌డం క‌ష్ట‌మే. అయిన‌ప్ప‌టికీ త‌మ‌న్నా త‌న స‌త్తా చాటుతోంది.

కాగా అనిల్ రావిపూడి ద‌ర్వ‌క‌త్వంలో ఎఫ్2 మూవీకి సీక్వెల్‌గా వ‌స్తున్న ఎఫ్3లో త‌మ‌న్నా అందాల‌ను ఒక రేంజ్‌లో ఆర‌బోసింది. ఇందులో వెంకీ స‌ర‌స‌న న‌టించిన ఈ భామ ఒక రేంజ్‌లో గ్లామ‌ర్ షో చేసింది. ఈ మూవీ ఈ నెల 27వ తేదీన విడుద‌ల కానుండ‌గా.. ఇందులో పూజా హెగ్డె ఒక స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసింది. ఇక ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా త‌మ‌న్నా షేర్ చేసిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now