Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ రూటు మార్చారా ? వేళ్ల‌కు ఆ ఉంగ‌రాలు ఏమిటి ?

May 8, 2022 9:43 PM

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ వైపు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. మ‌రోవైపు సినిమాల‌కు సైతం స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఆయన జ‌న‌సేన పార్టీతో ఏపీలో అధికారంలోకి రావాల‌ని భావించారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. దీంతో అప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్షం పాత్రనే పోషిస్తున్నారు. అయితే రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారితే సినిమాల‌ను వదిలేద్దామ‌ని ప‌వ‌న్ ఆశించారు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. దీంతో ఆయ‌న వ‌కీల్ సాబ్ తో సినిమాల్లోకి మ‌ళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆయ‌న ఓ వైపు రాజ‌కీయాలు.. మ‌రోవైపు సినిమాల‌తో చాలా బిజీగా ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం ప‌వ‌న్‌కు చెందిన ఓ ఫొటో వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ అందులో ప్ర‌త్యేక‌త ఏముంది ? అన్న విష‌యాన్ని ఒక్క‌సారి ప‌రిశీలిస్తే..

Pawan Kalyan has rings on fingers what are they
Pawan Kalyan

ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా ఏపీలో కౌలు రైతుల భ‌రోసా యాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌కు ఒక్కో కుటుంబానికి రూ.1 ల‌క్ష చొప్పున స‌హాయం చేస్తున్నారు. దీనికి గాను ఆయ‌న జ‌న‌సేన పార్టీకి భారీగా విరాళం ఇచ్చారు. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌లో ప‌వ‌న్ చేతులెత్తి న‌మ‌స్క‌రించిన‌ప్పుడు ఆయ‌న ఫొటోను క్లిక్‌మ‌నిపించారు. ఇక ఆ ఫొటోను ప‌రిశీలిస్తే.. ఆయ‌న చేతి వేళ్ల‌కు ఉంగ‌రాలు క‌నిపించాయి. దీంతో ఇప్పుడీ విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

ప‌వ‌న్ స్వ‌త‌హాగా చేగువేరా భావాలు క‌లిగిన వ్య‌క్తి. అలాంటిది ఆయ‌న ఇలా ఉంగ‌రాల‌ను ధ‌రించి క‌నిపించ‌డం అంటే.. ఆయ‌న జ్యోతిష్యాన్ని న‌మ్ముతున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఇలా ఆయ‌న స‌డెన్‌గా రూటు ఎందుకు మార్చారు ? అన్న ప్ర‌శ్న కూడా త‌లెత్తుతోంది. అయితే అలా ఉంగ‌రాల‌ను ధ‌రించాల‌ని ఓ ద‌ర్శ‌కుడు చెప్పార‌ట‌. అందుక‌నే ప‌వ‌న్ అలా చేస్తున్నార‌ట‌. దీంతో ఆయ‌న సీఎం కావాలనే కోరిక బ‌లంగా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. మ‌రి ప‌వ‌న్ క‌ల నెర‌వేరుతుందా.. లేదా.. అనేది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment