Kota Srinivasa Rao : చిరంజీవి ఎప్పుడైనా ఎవ‌రికైనా రూపాయి స‌హాయం చేశారా.. కోట శ్రీ‌నివాస రావు తీవ్ర విమ‌ర్శ‌లు..

May 8, 2022 2:06 PM

Kota Srinivasa Rao : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు కోట శ్రీ‌నివాస రావు మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన విష‌యం విదిత‌మే. అయితే ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు అప్ప‌ట్లోనే నాగ‌బాబు కౌంట‌ర్ ఇచ్చారు. త‌రువాత చాలా రోజుల‌కు కోట ఇప్పుడు మళ్లీ ఏకంగా చిరంజీవిపైనే తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న చిరంజీవిని తీవ్రంగా విమ‌ర్శించారు. ఇంత‌కీ కోట ఏమ‌న్నారంటే..

Kota Srinivasa Rao sensational comments on Chiranjeevi
Kota Srinivasa Rao

మేడే ఉత్స‌వాల్లో భాగంగా చిరంజీవి ప‌లు కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. వాటిపైనే కోట స్పందించారు. చిత్ర‌పురి కాల‌నీలో సినీ కార్మికుల కోసం హాస్పిట‌ల్ క‌ట్టించాల‌నుకుంటున్నాన‌ని చిరంజీవి అన్నారు. అయితే దీనిపై కోట విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌స్తుతం ఎంతో మంది అవ‌కాశాలు లేక కృష్ణాన‌గ‌ర్‌లో ఉంటున్నార‌ని.. చాలా మంది అవ‌కాశాలు లేక వ్య‌స‌నాల బారిన ప‌డుతున్నార‌ని.. వారికి అవ‌కాశాలు ఉంటే.. సినిమాల్లో న‌టిస్తూ డ‌బ్బులు సంపాదిస్తార‌ని.. అలాంట‌ప్పుడు వారు అపోలో హాస్పిట‌ల్‌కు వెళ్లాల‌ని చూస్తారు కానీ.. కార్మికుల హాస్పిట‌ల్‌కు ఎందుకు వెళ్తార‌ని.. కోట ప్ర‌శ్నించారు. కార్మికుల‌కు కావ‌ల్సింది హాస్పిట‌ల్ కాద‌ని.. తిండి.. అవ‌కాశాలు అని అన్నారు.

చిరంజీవి మేడే ఉత్స‌వాల్లో భాగంగా తాను కార్మికుడిన‌ని అన్నార‌ని.. అయితే రూ.కోట్ల‌ల్లో పారితోషికం తీసుకునేవారు కార్మికుడు ఎలా అవుతాడ‌ని అన్నారు. అలాగే ఆయ‌న సినిమాల్లో ఎవ‌రికైనా అవ‌కాశం ఇచ్చి ఆదుకున్నారా.. అని అడిగారు. ఇక చిరంజీవి తాను సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నాన‌ని చెప్పుకుంటార‌ని.. అయితే ఏనాడైనా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారికి ఒక్క రూపాయి అయినా స‌హాయం చేశారా.. అని ప్ర‌శ్నించారు. త‌న ఇంటికి వ‌చ్చే చిన్న కార్మికుల‌కు సైతం రూ.500 నుంచి రూ.1000 వ‌ర‌కు ఇస్తుంటాన‌ని.. ఇక అవ‌స‌రం ఉన్న‌వారికి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు కూడా తాను స‌హాయం చేశాన‌ని కోట అన్నారు. అలాగే తాను షుగ‌ర్ పేషెంట్ అయి ఉండి కూడా సినీ కార్మికుల కోసం గ‌తంలో 4 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాన‌ని గుర్తు చేశారు.

కాగా కోట చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై మెగా ఫ్యామిలీ నుంచి ఎవ‌రైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక చిరంజీవి ప్ర‌స్తుతం అమెరికా టూర్‌లో ఉన్నారు. ఆయ‌న న‌టించిన ఆచార్య మూవీ విడుద‌ల అనంత‌రం ఆయ‌న భార్య సురేఖ‌తో క‌లిసి టూర్‌కు వెళ్లారు. ఇంకో నెల రోజుల వ‌ర‌కు ఆయ‌న అక్క‌డే ఉండ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment