Chiranjeevi : ఒత్తిడికి దూరంగా.. చిరంజీవి వెకేష‌న్.. ఇంకో నెల రోజులు ఉండ‌రు..!

May 4, 2022 11:44 AM

Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం ఆచార్య‌. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై ప్రేక్ష‌కుల నుండి మిశ్ర‌మ స్పంద‌న‌ను సొంతం చేసుకుంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. సినిమా ఫ‌లితం ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఈ సినిమా త‌రువాత నెల రోజుల పాటు కుటుంబంతో క‌లిసి హాలిడే ట్రిప్ కు వెళ్లాల‌ని చిరంజీవి ఎప్పుడో నిర్ణ‌యించుకున్నారు. కానీ పరిస్థితుల కార‌ణంగా ఈ ట్రిప్ వాయిదా ప‌డింది.

Chiranjeevi goes on vacation with wife Surekha for one month
Chiranjeevi

కాగా చిరంజీవి త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి మే 1న యూఎస్ఏ వెళ్లాల‌ని అనుకున్నారు. కానీ సినీ ఇండ‌స్ట్రీలో జ‌రిగే మేడే కార్య‌క్ర‌మంలో పాల్గొన‌వ‌ల‌సిందిగా చిరంజీవిని ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి గాను చిరంజీవి త‌న ప్ర‌యాణాన్ని రెండు రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా త‌న భార్య సురేఖతో క‌లిసి యూఎస్ఏ వెళ్తున్న ఫోటోను చిరంజీవి అభిమానుల‌తో పంచుకున్నారు.

ఇదిలా ఉండ‌గా చిరంజీవి మ‌రో రెండు సినిమాల‌ను తెర‌కెక్కించే ప‌నిలో చాలా బిజీగా ఉన్నారు. మ‌ళ‌యాళం సినిమా లూసిఫ‌ర్ తెలుగు రీమేక్ లో చిరంజీవి న‌టిస్తున్నారు. దీనికి గాడ్ ఫాద‌ర్ అనే పేరును కూడా నిర్ణ‌యించారు. దీంతోపాటు మ‌రో త‌మిళ సినిమా వేదాళంను కూడా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. దీనికి భోళా శంక‌ర్ అనే పేరు పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. అలాగే కె.ఎస్.ర‌వి చంద్ర‌, వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలోనూ ఆయ‌న ఇంకో రెండు సినిమాల‌లో న‌టించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment