Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ‘ఆ’ అనే అక్ష‌రం క‌ల‌సి రాలేదు.. ఎలాగంటే..?

April 30, 2022 9:54 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి దాదాపు 4 ఏళ్ల గ్యాప్ అనంత‌రం ఆచార్య సినిమాతో మ‌న ముందుకు వ‌చ్చారు. ఇందులో ఆయ‌న త‌నయుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఇంకో కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు తొలి రోజే చాలా చోట్ల థియేట‌ర్ల‌లో ఖాళీ సీట్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. అయితే ఈ మూవీ నెమ్మ‌దిగా పుంజుకుంటుంద‌ని అనుకున్నారు. కానీ రెండో రోజు నుంచే నెగెటివ్ టాక్ ఎక్కువైపోయింది. చాలా మంది సినిమా బాగాలేద‌నే అంటున్నారు. దీంతో తప్పుడు ఎక్క‌డ జ‌రిగిందో చిత్ర యూనిట్ వెతికే ప‌నిలో ప‌డింది. అయితే ఆచార్య చిత్రం ఫ్లాప్‌ను మూట‌గ‌ట్టుకున్న త‌రుణంలో చిరంజీవికి చెందిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే..

aa letter is not good for Chiranjeevi
Chiranjeevi

చిరంజీవి ఆచార్య మూవీ ఫ్లాప్ కావ‌డంతో ఒక పాత సెంటిమెంట్ మ‌ళ్లీ రిపీట్ అయింద‌ని అంటున్నారు. అదేమిటంటే.. చిరంజీవి న‌టించిన ప‌లు చిత్రాలు ఆ అనే అక్షరంతో మొద‌ల‌య్యాయి. అయితే ఈ సినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అందుక‌ని చిరంజీవికి ఆ అనే అక్ష‌రం క‌ల‌సి రాలేద‌ని అంటున్నారు. దీన్ని ఇంకా ప‌రిశీలిస్తే.. చిరంజీవి కెరీర్‌లో ఆ అనే అక్ష‌రంతో వ‌చ్చిన మొద‌టి సినిమా ఆర‌ని మంట‌లు. అప్ప‌టికి ఆయ‌న‌కు ఇంకా ఇమేజ్ రాలేదు. దీంతో ఈ సినిమా ఆడలేదు.

తరువాత చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు కూడా పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. అలాగే ఆలయ శిఖరం, తమిళ డైరెక్టర్ భారతీరాజాతో చేసిన ఆరాధన, కె విశ్వనాథ్ ఆపద్బాంధవుడు.. వంటి చిత్రాలు కూడా ఆ అనే అక్ష‌రంతోనే మొద‌ల‌య్యాయి. ఇవ‌న్నీ ఫ్లాప్ సినిమాలే. ఆరాధ‌న‌, ఆపద్బాంధ‌వుడు చిత్రాలు చిరంజీవికి న‌ట‌న ప‌రంగా పేరు తెచ్చాయే కానీ.. క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ కాలేదు. ఇక ఇప్పుడు ఆ అనే అక్ష‌రంతో వ‌చ్చిన ఆచార్య కూడా ఫెయిల్ అయింది. క‌నుక చిరంజీవికి ఆ అనే అక్ష‌రం క‌ల‌సి రాలేద‌ని అంటున్నారు.

అయితే మొద‌టి అ తో వ‌చ్చిన అడవిదొంగ, అల్లుడా మజాకా, అన్నయ్య లాంటి సినిమాలు మాత్రం ఘ‌న విజయం సాధించాయి. అందుక‌ని రెండో ఆ చిరుకు అచ్చి రాలేద‌ని అంటున్నారు. ఇక ఆయ‌న న‌టిస్తున్న గాడ్ ఫాద‌ర్‌, భోళా శంక‌ర్ సినిమాలు ఈ ఏడాది వ‌రుస‌గా రిలీజ్ కానున్నాయి. అవి హిట్ అవుతాయో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment