Disha Patani : అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేస్తున్న లోఫర్ బ్యూటీ..!

April 30, 2022 4:10 PM

Disha Patani : తెలుగు తెర‌పై సంద‌డి చేసి ఆ త‌ర్వాత బాలీవుడ్‌కి వెళ్లి స్టార్ హీరోయిన్‌గా మారిన ముద్దుగుమ్మ‌లు చాలా మందే ఉన్నారు. వారిలో దిశా ప‌టాని ఒకరు. లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది దిశా పటాని. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో దిశా పటాని అందాల విందు చేసింది. అయితే ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో దిశా పటానికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కింది. అక్క‌డ సినిమాల సంగ‌తేమో కానీ ప్రేమ వ్య‌వ‌హారాలు, అందాల ఆర‌బోత‌తో నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటోంది.

Disha Patani latest purple color photos trending
Disha Patani

అందాల ఆర‌బోత‌ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో దిశా సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. త‌న ఎద అందాల‌తో పాటు థైస్ అందాలు చూపిస్తూ కుర్ర‌కారుకి కంటిపై క‌నుకు లేకుండా చేస్తోంది. ఇక టైగర్ ష్రాఫ్, దిశా పటానిలు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోన్నారని నిత్యం క‌థనాలు వ‌స్తూనే ఉంటాయి. వాటిపై ఈ ఇద్ద‌రూ ఏ మాత్రం స్పందించ‌డం లేదు. ఇటీవ‌లే టైగర్ ష్రాఫ్, దిశా పటానిలు దూరమయ్యారంటూ రూమర్లు వచ్చాయి. అందుకు కార‌ణం ఇటీవ‌ల ఈ ఇద్ద‌రు జంట‌గా క‌నిపించ‌క‌పోవ‌డ‌మే.

టైగర్ ష్రాఫ్, తారా సుతారియా జంటగా నటించిన హీరోపంతి 2 చిత్రం కోసం రీసెంట్‌గా స్పెష‌ల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయ‌గా.. దానికి దిశా పటాని హాజ‌రైంది. అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా పొట్టి దుస్తుల‌లో ఎద అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేసింది. మినీ బ్లూ డ్రెస్ లో మెరిసిన దిశా ని చూసి త‌న్మ‌య‌త్వం చెందారు ఆమె అభిమానులు. సోష‌ల్ మీడియాలో కూడా దిశా ఫొటోలు తెగ సంద‌డి చేస్తున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే దిశా పటాని ప్రస్తుతం ఏక్ విలన్ 2లో నటిస్తోంది. ఈ చిత్రంలో దిశాతోపాటు అర్జున్ కపూర్, జాన్ అబ్రహాం, తారా సుతారియాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now