Pooja Hegde : పూజా హెగ్డెపై మ‌ళ్లీ ఆ ముద్ర‌.. కుంగిపోయిన బుట్ట‌బొమ్మ‌..?

April 30, 2022 2:11 PM

Pooja Hegde : రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ ముందుకు వ‌ర‌కు పూజా హెగ్డె క్రేజ్ మాములుగా ఉండేది కాదు. చిన్న‌హీరోతో న‌టించినా, పెద్ద హీరోతో అయినా.. ఆ సినిమా హిట్ట‌వ్వాల్సిందే. ఈ క్ర‌మంలో దిల్ రాజు బీస్ట్ ప్ర‌మోష‌న్స్ లో పూజా మ‌న కాజా అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. పూజా మ‌న కాజా.. ఆమె లెగ్గు పెడితే సూప‌ర్ హిట్టే. డీజే, మ‌హ‌ర్షి, అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పుర‌ములో సూప‌ర్ హిట్ మూవీస్ అయ్యాయి. బీస్ట్ మూవీ ఆల్ రెడీ సూప‌ర్ హిట్‌. నాకు కూడా సూప‌ర్ హిట్ కావాలి. కాబ‌ట్టి నాకు పూజా డేట్స్ ఇస్తే బాగుంటుంది. ఆమె తెలుగు, త‌మిళం, హిందీ.. ఇలా ప్ర‌తి భాష‌లోనూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆల్ ఇండియా హీరోయిన్‌గా మారింది. డ్యాన్సుల‌తోపాటు ప‌ర్‌ఫార్మెన్స్ ప‌రంగా ప్ర‌తి సినిమాకు ఎదుగుతూ వ‌స్తోంది.. అని తెగ ప్ర‌శంస‌లు కురిపించారు.

Pooja Hegde became iron leg again after 3 successive movie failures
Pooja Hegde

అయితే రాధే శ్యామ్ ఫ్లాప్ పూజాని కాస్త కుంగదీయ‌గా, బీస్ట్ ప‌రాజ‌యంతో పూజాపై కాస్త నెగెటివిటీ ఏర్ప‌డింది. ఇక ఆచార్య ఫ్లాప్ త‌ర్వాత పూజాని ఐరెన్ లెగ్ అంటూ విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. ఏమ‌య్యా.. దిల్ రాజు పూజా మ‌న కాజానా అంటూ ఆయ‌న‌ను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఆచార్య చిత్రంలో పూజాది చిన్న రోల్ మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ ఆ అమ్మ‌డి వ‌ల్ల‌నే సినిమా ఫ్లాప్ అయిందని కొంద‌రు వితండ‌వాదం చేస్తున్నారు. పూజా తిరిగి సేఫ్‌ జోన్‌లోకి రావాలంటే మ‌హేష్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు ఈ అమ్మ‌డిని ఆదుకోవాలి.

పూజా హెగ్డె త్వ‌ర‌లో మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న సినిమాలో న‌టించ‌నుంది. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- హ‌రీష్ శంకర్ సినిమాలోనూ ఈ అమ్మ‌డినే క‌థానాయిక‌గా ఎంపిక చేశారు. ఈ ప‌రిస్థితుల‌లో పూజా రెండు సినిమాల‌పై భారీ అంచ‌నాలే పెట్టుకుంది. ప్ర‌స్తుతం ఈమె ఒక సినిమాకి రూ.3.50 కోట్లు తీసుకుంటుంద‌ని టాక్. రీసెంట్‌గా ఎఫ్3 సినిమాలో స్పెష‌ల్ డ్యాన్స్‌తోనూ ఈ అమ్మ‌డు అద‌ర‌గొట్టింద‌నే టాక్ న‌డుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment