Tamannaah : త‌మ‌న్నా అందాలను చూస్తుంటే.. మ‌తులు పోవ‌డం ఖాయం..!

April 30, 2022 11:12 AM

Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇటీవ‌లి కాలంలో సినిమాల క‌న్నా త‌న గ్లామ‌ర్‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తోంది. ఒక‌ప్ప‌టి మాదిరిగా త‌న‌కు సినిమా ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో తమన్నా గ్లామర్‌ డాల్‌ రోల్స్ కి సిద్దంగా ఉన్నాన‌నే సంకేతాలను దర్శకనిర్మాతలకు పంపిస్తోందని తెలుస్తోంది. ఇటీవ‌లి కాలంలో త‌మ‌న్నా పొట్టి దుస్తుల‌లో త‌న అందాలు ఆర‌బోస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తోంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా తన గ్లామర్ షోతో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమాల్లో గ్లామర్ షోకి నో చెప్పని తమన్నా ప్రైవేట్ ఫోటో షూట్స్ లో కూడా రెచ్చిపోతోంది.

Tamannaah latest sky blue color dress photos trending
Tamannaah

చూస్తుంటే రానున్న రోజుల‌లో త‌మ‌న్నా వెండితెర‌పై కూడా బోల్డ్ లుక్‌లో ప్రేక్ష‌కుల‌కి వినోదం పంచేందుకు సిద్ధంగా ఉంద‌ని అర్ధ‌మ‌వుతోంది. ఎఫ్‌2లో గ్లామర్‌ పాత్రలో న‌టించిన‌ త‌మన్నా మళ్లీ తన లక్‌ని టాలీవుడ్‌లోనే పరిక్షించుకుంటోంది. అందుకే ఎఫ్‌2 సీక్వెల్‌ కోసం పొట్టి పొట్టి డ్రెస్సులతో తన సొగసులను ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. సియాన్‌ కలర్ సింగిల్ పీస్ డ్రెస్‌లో తన అందాల్ని చూపిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది తమన్నా. తమన్నా తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోల‌కి నెటిజన్ల నుంచి రెస్పాన్స్ బీభత్సంగా వస్తోంది.

హిందీ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన తమన్నా కేవలం తెలుగు సినిమాల వల్లే నాలుగు రాళ్ళు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత అన్ని భాషల్లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు తర్వాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించిన తమన్నా 2005లో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రా అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బాహుబ‌లి సినిమాతో ఆమె క్రేజ్ మ‌రింత పెరిగింది. అయితే ఈ మధ్య కాలంలో కొత్త భామల ఎంట్రీతో ఆమె క్రేజ్ తగ్గింద‌నే చెప్పాలి. చివరగా సీటిమార్ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె గని సినిమాలో ఒక ఐట‌మ్‌ సాంగ్ లో కూడా మెరిసింది. కానీ అది అంతగా ఆకట్టుకోలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now