Sri Reddy : కుండ బిర్యానీ వండిన శ్రీ‌రెడ్డి.. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా..!

April 30, 2022 7:22 AM

Sri Reddy : ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో శ్రీ‌రెడ్డి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. త‌న‌కు న‌చ్చిన వంట‌ల‌ను చేస్తూ ఆ వీడియోల‌ను ఆమె యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తోంది. అలాగే న‌చ్చిన ప్ర‌దేశాల‌కు టూర్ల‌కు కూడా వెళ్తోంది. ఇటీవ‌లే ఆమె గోవాలో సంద‌డి చేసింది. అక్క‌డ ఎన్‌టీఆర్‌కు ఇష్ట‌మైన ప్ర‌దేశాలు ఇవే.. అంటూ ఆమె టూర్‌లో తిరిగి ఆయా ప్ర‌దేశాల‌ను చూపించింది. ఇక తాజాగా మ‌రోసారి ఇంకో వంట వీడియోతో మ‌న ముందుకు వచ్చింది. ఈసారి ఆమె కుండ బిర్యానీ వండి అల‌రించింది.

Sri Reddy cooked Kunda Biryani
Sri Reddy

సోష‌ల్ మీడియాలో ఎంతో సంద‌డి చేస్తున్న శ్రీ‌రెడ్డి తాజాగా కుండ బిర్యానీ వండింది. అది భీమ‌వ‌రం కుండ బిర్యానీ. చూస్తుంటేనే నోరూరిపోతోంది. ఆ బిర్యానీని వండిన శ్రీ‌రెడ్డి దాని వీడియోను పోస్ట్ చేయ‌గా.. అది యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది. చాలా మంది ఆ వీడియోను ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు. శ్రీ‌రెడ్డి కుండ బిర్యానీ అద్భుతంగా ఉంద‌ని.. దాన్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంద‌ని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. త‌మ‌కు కూడా ఆ బిర్యానీ కావాల‌ని ఆమెను అడుగుతున్నారు.

ఇక శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య కాలంలో త‌రచూ వార్త‌ల్లో నిలుస్తోంది. అనేక సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై కూడా ఆమె స్పందిస్తోంది. దీంతో ఆమె కామెంట్స్ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఇక శ్రీ‌రెడ్డి ఈ మ‌ధ్య మెగా డాట‌ర్ నిహారిక‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసింది. ఆమె డ్ర‌గ్స్ కేసులో చిక్కుకుపోవడంతో కుమార్తెను ఇలాగేనా పెంచేది నాగ‌బాబు అంటూ తీవ్ర స్థాయిలో ఆయ‌న‌పై ఆమె విమ‌ర్శ‌లు చేసింది. కానీ నాగ‌బాబు కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. త‌న‌ను విమ‌ర్శించే వాళ్ల‌కు ఆయ‌న ఒక్క వాక్యంతో స‌మాధానం చెప్పారు. దీంతో ఆయన కామెంట్స్ కూడా ఇటీవ‌ల వైర‌ల్ అయ్యాయి. అయితే నిహారిక మ‌ళ్లీ ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చి ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తుండ‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now