Pawan Kalyan : చిన్న‌పిల్లాడిలా గ‌న్ చేత ప‌ట్టి క‌నుకు తీసిన ప‌వ‌న్.. వైర‌ల్ అవుతున్న ఫొటో..!

April 29, 2022 11:38 AM

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం సినిమాలు, రాజ‌కీయాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవ‌ల భీమ్లా నాయ‌క్ చిత్రంతో పల‌క‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా హ‌రిహ‌ర వీర మ‌ల్లు చిత్ర మేకర్స్‌ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌తో ఆక‌ట్టుకున్నారు. ప‌వ‌న్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ప్ర‌తి ఒక్క‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గ‌త కొద్ది రోజ‌లుగా ఈ మూవీ షూటింగ్‌తో ప‌వ‌న్‌ బిజీగా ఉన్నారు.

Pawan Kalyan sleeping like child photo viral
Pawan Kalyan

విరామం సమయంలో పవన్ కళ్యాణ్ కునుకు తీస్తూ కనిపించారు. పవన్ గన్ పట్టుకుని చిన్న పిల్లాడిలా నిద్రిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత బిజీ షెడ్యూల్ వ‌ల్ల‌ సెట్స్‌లో టైం దొర‌కిన‌ప్పుడు ఇలా ప‌డుకుంటున్నారేమో అని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. హరి హర వీర మల్లు అనేది యాక్షన్ డ్రామా. ఇందులో పవన్ గ‌జ‌దొంగ‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. జాక్వెలిన్ ఓ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌నే టాక్ వినిపిస్తోంది.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను ఓ వార్ సీన్ తో తిరిగి ప్రారంభించారు. అందుకోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. స్టంట్ మాస్టర్స్ నేతృత్వంలో ఫైట్ సీన్స్ కోసం వర్కౌట్స్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మరో చిత్రంలో నటించనున్నారు. ఆ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment