Samantha : ప్చ్‌.. స‌మంత ప‌డ్డ క‌ష్టం అంతా వృథాయేనా..?

April 26, 2022 11:10 PM

Samantha : టాలీవుడ్ ముద్దుగుమ్మ స‌మంత ఇటీవ‌లి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ అమ్మ‌డు సినిమాలు, ప‌ర్స‌న‌ల్ విష‌యాలు, సోష‌ల్ మీడియా పోస్ట్‌ల‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షిస్తోంది. స‌మంత కొద్ది రోజుల క్రితం శాకుంత‌లం అనే చిత్ర షూటింగ్ పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. మ‌హాభార‌తంలోని ఆదిప‌ర్వం స్పూర్తిగా.. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగా తెర‌కెక్కుతోంది. మైథ‌లాజిక‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌స్తున్న ఈ సినిమాలో సామ్ శ‌కుంత‌లగా క‌నిపించ‌నుండ‌గా.. మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ దుష్యంత‌ రాజుగా న‌టిస్తున్నాడు. క‌బీర్ సింగ్ దుహ‌న్ రాజు అసుర పాత్ర పోషిస్తున్నాడు.

Samantha hard work may be wasted
Samantha

గుణ‌శేఖ‌ర్ డ్రీమ్ ప్రాజెక్టుగా వ‌స్తున్న ఈ సినిమా కోసం సామ్ ప్ర‌త్యేకించి బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ తీసుకుంది. శ‌కుంత‌ల పాత్ర కోసం మూడు నెల‌లు శిక్ష‌ణ తీసుకున్న‌ట్టు చెప్పింది సామ్‌. పురాణాల కాలం నాటి సాధారణ భంగిమలు, మనోహరమైన నడక, పౌరాణిక పాత్రలతో అనుసంధానంగా ఉండే సంజ్ఞలు, ఇత‌ర అంశాల‌పై సామ్ శిక్ష‌ణ తీసుకుంద‌ట‌. అయితే ఈ సినిమా కోసం చాలా మంది అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా, కొన్నాళ్లుగా ఒక్క అప్‌డేట్ లేదు. క‌నీసం స‌మంత ఈ సినిమా చేసింద‌ని కొంత మందికి తెలియ‌దు కూడా.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే సినిమా కోసం ఆమె ప‌డిన క‌ష్టం, త్యాగం అన్ని వృథా అయిన‌ట్టేన‌ని అభిమానులు చాలా బాధ‌ప‌డుతున్నారు. స‌మంత ఈ సినిమా కోసం ప‌డిన‌ క‌ష్టం అంతా వేస్ట్ అయిన‌ట్టేనా అని కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. శాకుంత‌లం సినిమా స్పూర్తితో స‌మంత రానున్న రోజుల‌లో మ‌రిన్ని లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌లు చేయాల‌ని అనుకుంద‌ని, కానీ ఈ సినిమా నీరు గార్చింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. శాకుంత‌లం సినిమాని 2022 చివ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. యువ‌రాజు భ‌ర‌త పాత్ర‌లో అల్లు అర్జున్ కూతురు అర్హ క‌నిపించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment