Acharya Movie First Review : ఆచార్య ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయ‌డం ఖాయం..!

April 22, 2022 5:08 PM

Acharya Movie First Review : చిరంజీవి, రామ్ చరణ్‌ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఈ సినిమాపై మెగాభిమానులతోపాటు సామాన్య ప్రేక్షకుల్లోనూ ఎంత ఆస‌క్తి ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప‌లుమార్లు వాయిదా ప‌డిన త‌ర్వాత ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుద‌ల‌య్యేందుకు సిద్ధ‌మైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అతి కీలకమైన సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా ఉంది. ఇక ఈ సినిమాకి సెన్సార్ రివ్యూ కూడా పాజిటివ్ గానే రావడం విశేషం. ఆచార్య ఫస్ట్ హాఫ్ మామూలుగా ఉన్నప్పటికీ సెకండాఫ్‌లో యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి, రామ్‌చరణ్‌ల కలయికలో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయట.

Acharya Movie First Review is out see how this one is
Acharya Movie First Review

చిత్రంలో సెకండాఫ్‌లో రామ్ చ‌ర‌ణ్ క‌నిపిస్తాడ‌ని ఆయ‌న పాత్ర చిరంజీవి క‌న్నా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంద‌నే టాక్ వినిపిస్తోంది. ఎక్కువ‌గా హైంద‌వ సాంప్ర‌దాయాల‌కు ప్రాధాన్యత ఇస్తూ.. ధ‌ర్మ‌స్థ‌లిని కాపాడేందుకు జ‌రిగే పోరాటం చుట్టూ క‌థ ఉంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇలా సినిమాకు పాజిటివ్ గానే సెన్సార్ టాక్ వ‌చ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. సినిమా క్లైమాక్స్ పవర్‌ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి మెగా అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉందని అంటున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వ‌డం మ‌రో స్పెషల్ అట్రాక్ష‌న్‌గా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర చనిపోతుందనే టాక్ నడుస్తోంది. గతంలో రామ్ చరణ్ నటించిన మగధీర, ఎవడు చిత్రాల్లో చనిపోయే పాత్రల్లో నటించారు. ఆయా సినిమాలు సూపర్ హిట్ట‌య్యాయి. అదే కోవలో ఆచార్యకు రామ్ చరణ్ పాత్ర సిద్ధ చనిపోవడం కలిసి వస్తోందని అభిమానులు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు. కొరాటాల ఈ సినిమాని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించాడ‌ని, సినిమా ప్రేక్ష‌కుల‌కి కొత్త అనుభ‌వం అందిస్తుంద‌ని అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment