Kiara Advani : మేక‌ప్ లేకుండా కియారా అద్వానీ ఎలా ఉందో చూస్తే.. షాక‌వుతారు..!

April 20, 2022 10:27 PM

Kiara Advani : కియారా అద్వానీ.. ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం. హీరోయిన్‌గా తొలి సినిమా ఫగ్లీతోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్‌ సింగ్‌, భరత్‌ అనే నేను చిత్రాలతో బ్లాక్‌ బస్టర్‌ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్‌ సంపాదించుకుంది. తెలుగులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న విన‌య విధేయ రామ అనే సినిమా కూడా చేసింది. ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ త‌న హ‌వా చూపిస్తోంది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ 15వ సినిమాలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Kiara Advani surprise look photos viral
Kiara Advani

సాధార‌ణంగా కియారా ఎప్పుడూ అంద‌చందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ చేస్తుంటుంది. క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తుంటుంది. కానీ ఈ అమ్మ‌డు చాలా సింపుల్ డ్రెస్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. తాజాగా ఈమె స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. అక్కడికి సాధారణ కుర్తా సూట్ లో వెళ్ళింది. ఊదా, గులాబీ, ఆకుపచ్చ రంగులలో అందంగా రంగు రంగుల పూల ప్రింట్ లతో కూడిన‌ కుర్తా ధ‌రించి క‌నిపించింది. అస‌లు ఆమె కియారానేనా అని అంద‌రూ అనుకుంటున్నారు. ఈ అమ్మ‌డు చాలా రోజుల త‌ర్వాత ఇంత ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఈమె అసలు పేరు ఆలియా అద్వానీ. అప్పటికే ఆలియా పేరుతో ఓ హీరోయిన్ ఉండటంతో ఈమె తన పేరును కియారాగా మార్చుకుంది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత కథపై తెరకెక్కిన ఎంఎస్ ధోని.. ది అన్‌టోల్డ్ స్టోరీలో హీరోయిన్‌గా నటించింది. దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కియారా దశ తిరిగింది. జిమ్‌ సూట్‌, పైజమాలో కంఫర్ట్‌గా ఫీలవుతాను. భారతీయ సంప్రదాయ దుస్తులంటే ఇష్టం అని ప‌లు సంద‌ర్భాల‌లో చెప్పింది కియారా. కియారా అద్వానీ మొదట్లో నెట్‌ఫ్లిక్స్ కోసం చేసిన అంతాలజీ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ ఈమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో ఓ గృహిణి పాత్రలో కియారా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ వెబ్ సిరీస్‌లో కియారా బోల్డ్ యాక్టింగ్‌కు అందరు ఫిదా అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now