Bandla Ganesh : బండ్ల గ‌ణేష్ మళ్లీ బుక్క‌య్యాడుగా.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌..!

April 20, 2022 10:33 AM

Bandla Ganesh : వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి స‌తీమ‌ణి, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి విజ‌యమ్మ మంగ‌ళ‌వారం త‌న బ‌ర్త్ డే జ‌రుపుకుంది. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర క్యాంపు వద్ద వైఎస్ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. లక్ష్మీదేవిపల్లి వద్ద కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో వై.ఎస్.విజయమ్మకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు షర్మిల. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా విజయమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల తన తల్లితో కేక్ కట్ చేయించారు. ముద్దాడి బర్త్ డే విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్ డే మామ్ అంటూ ట్వీట్ చేశారు. ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

Pawan Kalyan fans angry on Bandla Ganesh for his wishes to YS Vijayamma
Bandla Ganesh

వైసీపీ ముఖ్యనేత విజయసాయి రెడ్డి సైతం విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అందులో.. జగన్ ను విజయమ్మ ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేశారు. ఆ ట్వీట్ లో.. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్యమాత అయ్యారు అని తెలిపారు. ఇక వైఎస్ జ‌గ‌న్ త‌న త‌ల్లికి సంబంధించి ఎలాంటి ట్వీట్ చేయ‌క‌పోవ‌డం విశేషం. ఇక ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బండ్ల గ‌ణేష్ విజ‌యమ్మ‌కు బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేసి వార్త‌ల‌లోకి ఎక్కాడు.

ప‌వ‌న్‌కి వీర భ‌క్తుడిగా ఉండే బండ్ల‌.. విజ‌య‌మ్మ‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డంతో నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాతృ సమానులు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, చల్లగా ఉండాలని, ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్షు ఇవ్వాలని.. ఆయురారోగ్య అభివృద్ధిరస్తు.. అంటూ బండ్ల‌గ‌ణేష్ ట్వీట్ చేశాడు. అయితే జ‌గ‌న్ అభిమానులు బండ్ల గ‌ణేష్ ట్వీట్ చేయ‌డం పట్ల సంతోషం వ్య‌క్తం చేస్తుండ‌గా, జ‌న‌సైనికులు మాత్రం ఏకి పారేస్తున్నారు. ప‌వ‌న్‌కి భ‌క్తుడిని అని చెబుతూ ఇలాంటివి చేయ‌డం క‌రెక్టేనా అని ప్ర‌శ్నిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment