Pooja Hegde : పూజా హెగ్డెను తెగ ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్లు.. అంత హ‌డావిడి అవ‌స‌ర‌మా ? అని కామెంట్లు..!

April 15, 2022 10:01 AM

Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్డెకు చూస్తుంటే ప్ర‌స్తుతం బ్యాడ్ టైమ్ న‌డుస్తున్న‌ట్లు ఉంది. గతేడాది ఈమె న‌టించిన అన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమె కెరీర్‌లో ఎన్న‌డూ లేని విధంగా మొన్న‌టి వ‌ర‌కు టాప్ గేర్‌లో దూసుకుపోయింది. కానీ ఈమె న‌టించిన తాజా చిత్రాలు రెండూ వ‌రుస‌గా ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డెకు బెంగ ప‌ట్టుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అయితే ఈ విష‌యం అలా ఉంచితే.. పూజా హెగ్డెను మాత్రం నెటిజ‌న్లు మ‌రో విష‌యంలో ట్రోల్ చేస్తున్నారు.

netizen troll Pooja Hegde for her character in Beast movie
Pooja Hegde

విజ‌య్‌, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వ‌చ్చింది. సాక్షాత్తూ విజ‌య్ ఫ్యాన్సే సినిమా అస్స‌లు బాగా లేద‌ని.. ఏకంగా థియేటర్‌లో తెర‌కు నిప్పు పెట్టారంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలా రెండు వ‌రుస ఫ్లాప్‌ల‌తో పూజా హెగ్డె విచారంలో ఉంది. దీనికి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా మ‌రోవైపు నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

నిజానికి బీస్ట్ చిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ.. ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్య‌త క‌ల్పించ‌లేద‌నే చెప్పాలి. విజయ్ చేసే యాక్ష‌న్‌ను చూస్తూనే ప్రేక్ష‌కులు సినిమాను వీక్షించాల‌ని అనుకున్నారు కాబోలు.. పూజా హెగ్డె క్యారెక్ట‌ర్‌కు అస‌లు ప్రాధాన్య‌త లేకుండా పోయింది. అయితే ఇంత మాత్రానికే పూజా హెగ్డె సినిమా ప్ర‌మోష‌న్ల‌లో అంత హ‌డావిడి చేయ‌డం అవ‌స‌ర‌మా.. అనవ‌స‌రంగా ఓవ‌ర్ యాక్ష‌న్ చేసింది.. అస‌లు సినిమాలో ఆమె మాకు క‌నిపించ‌నే లేదు.. అంటూ నెటిజ‌న్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. రాధేశ్యామ్‌, బీస్ట్ చిత్రాలు వ‌రుస‌గా ఫ్లాప్ అవ‌డంతో ఇక పూజా హెగ్డె త‌న త‌దుప‌రి చిత్రం ఆచార్య‌పైనే హోప్స్ పెట్టుకుంది. మ‌రి ఈ మూవీ అయినా ఆమెను ర‌క్షిస్తుందో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment