Viral Video : వామ్మో.. రోడ్డుపై కోతి ద‌ర్జాగా ఎలా న‌డుచుకుంటూ వెళ్తుందో చూడండి.. వీడియో..!

April 14, 2022 5:13 PM

Viral Video : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో నిత్యం అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అన్ని సంఘ‌ట‌న‌ల‌కు అంతటి ప్రాముఖ్య‌త ఉండ‌దు. కానీ కొన్ని సంఘ‌ట‌న‌లు మాత్రం మ‌న‌ల్ని విప‌రీతంగా ఆక‌ర్షిస్తాయి. ముఖ్యంగా మ‌న చుట్టూ ప్ర‌కృతిలో జీవించే కొన్ని ర‌కాల జీవులు చేసే ప‌నుల‌కు మ‌న‌కు న‌వ్వు వ‌స్తుంటుంది. అవి మ‌న‌ల్ని వాటి చేష్ట‌ల‌తో ఆక‌ట్టుకుంటుంటాయి. అలాంటి జీవుల్లో కోతులు ఒక‌టి అని చెప్ప‌వ‌చ్చు. ఇవి చేసే అల్ల‌రి ప‌నులు అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తుంటాయి. ఇక తాజాగా ఇలాగే ఓ కోతి కూడా త‌న వింతైన చేష్ట‌ల‌తో అంద‌రికీ న‌వ్వు తెప్పిస్తోంది.

Viral Video see how monkey walked on road
Viral Video

ఒక కోతి రోడ్డుపై అచ్చం మనుషులు రెండు కాళ్ల‌తో న‌డిచిన‌ట్లుగానే న‌డుస్తూ ద‌ర్జాగా వెళ్లింది. అనంత‌రం బ్రిడ్జిపైకి జంప్ చేసి అక్క‌డ పోల్స్ మీద చాలా దూరం నుంచి అనేక సార్లు మ‌ళ్లీ జంప్ చేస్తూ వెళ్లింది. చూస్తే ఎంతో న‌వ్వు తెప్పించేలా ఉన్న ఈ సంఘ‌ట‌నను కొంద‌రు కెమెరాల్లో బంధించి వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

ఇప్ప‌టికే ఈ వీడియోకు 10.4 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. 47వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. అనేక మంది కామెంట్స్ చేస్తున్నారు. అచ్చం మ‌నుషుల్లాగే ఈ కోతి ప్ర‌వ‌ర్తించింద‌ని కొంద‌రు అంటే.. చాలా అద్భుతంగా జంప్‌లు చేసింద‌ని.. ఇంకొంద‌రు ఈ కోతికి కితాబిస్తున్నారు. ఇక ఈ వీడియోను చాలా మంది ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment