Vantalakka : కార్తీక దీపం వంట‌ల‌క్క వ‌ద్ద ఉద్యోగాలు.. ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది..!

April 14, 2022 2:21 PM

Vantalakka : కార్తీక దీపం సీరియ‌ల్ ద్వారా వంట‌ల‌క్క‌గా మ‌న‌కు ప‌రిచ‌యం అయిన దీప అస‌లు పేరు.. ప్రేమి విశ్వ‌నాథ్. ఈమె అస‌లు పేరు చాలా మందికి తెలియ‌దు కానీ.. దీప‌గా.. వంట‌ల‌క్క‌గా ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. అయితే మొన్నీ మ‌ధ్యే ఈ సీరియ‌ల్‌లో కార్తీక్‌, దీప‌ల పాత్ర‌ల‌ను చంపేశారు. దీంతో వారి కూతుళ్లతో సీరియ‌ల్‌ను కొన‌సాగిస్తున్నారు. అయితే తాజాగా ప్రేమి విశ్వ‌నాథ్ ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఈ మేర‌కు ఆమె పోస్ట్ పెట్టింది.

Vantalakka Premi Viswanath announced jobs
Vantalakka

త‌మ వ‌ద్ద ప‌లు ఉద్యోగాల‌కు ఖాళీలు ఉన్నాయ‌ని ప్రేమి విశ్వ‌నాథ్ ఒక ప్ర‌క‌ట‌న‌ను పోస్ట్ చేసింది. త‌మ‌కు ఫోర్ వీల‌ర్ (ఆటోమేటిక్‌, మాన్యువ‌ల్‌)ల‌ను న‌డిపే డ్రైవ‌ర్లు కావాల‌ని.. అన్ని ర‌కాల ఫోర్ వీల‌ర్‌ల‌ను న‌డిపేవారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చ‌ని.. వాహ‌నం బాగా న‌డ‌ప‌డం వ‌చ్చి ఉండాల‌ని తెలిపింది. అలాగే టాలీ వ‌చ్చిన అభ్య‌ర్థులు అకౌంటెంట్‌గా కావాల‌ని చెప్పింది. వారికి క‌నీసం 2 సంవ‌త్సరాల అనుభ‌వం ఉండాల‌ని తెలియ‌జేసింది. దీంతో ప్రేమి విశ్వ‌నాథ్ పెట్టిన ఈ ఉద్యోగ ప్ర‌క‌ట‌న పోస్ట్‌కు చాలా మంది స్పందిస్తున్నారు.

అయితే ఉద్యోగం చేయాల‌నుకునేవారు కొచ్చిలోని ఎర్నాకులంలో ప‌నిచేయాలి. మ‌రి అక్క‌డి ఉద్యోగాల‌కు ఇక్క‌డ ఎలా ప్ర‌క‌ట‌న ఇచ్చారో తెలియ‌దు కానీ.. ఆస‌క్తి ఉన్న‌వారు.. అంత దూరం వెళ్లి ప‌నిచేస్తాం.. అనుకునేవారు ఒక‌సారి ప్ర‌య‌త్నించ‌వచ్చు. ఇక ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment