Sreeja Kalyan : అంతుప‌ట్ట‌ని చిరంజీవి చిన్న‌కూతురు వ్య‌వహారం.. క‌ళ్యాణ్ దేవ్ పోస్ట్ అర్ధ‌మేంటి ?

April 12, 2022 7:57 PM

Sreeja Kalyan : ఇటీవ‌ల మెగా ఫ్యామిలీ ప‌లు విష‌యాల‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. శ్రీజ క‌ళ్యాణ్ దేవ్ వ్య‌వ‌హారం ఇప్ప‌టికీ చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న స‌మయంలో నిహారిక డ్ర‌గ్స్ కేసులో దొర‌క‌డం హాట్ టాపిక్‌గా మారింది. అయితే శ్రీజ విష‌యానికి వ‌స్తే కొద్ది రోజుల క్రితం శ్రీజ త‌న పేరులో కళ్యాణ్ అనే పేరుని తీసేసి.. కొణిదెలగా మార్చుకుంది. ఇన్ స్టాలో మార్చిన ఈ పేరుతోనే విడాకుల రూమర్లు ఎక్కువయ్యాయి. అయితే వీరికి అధికారికంగా ఇంకా విడాకులు మంజూరు కాలేదని తెలుస్తోంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ విషయంలో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని సారాంశం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరు చిన్న కూతురు మరోసారి విడాకులు తీసుకుంటుందనే ప్రచారం బాగానే జరుగుతోంది.

Sreeja Kalyan posted about their daughter
Sreeja Kalyan

ఈ విష‌యంపై అటు కళ్యాణ్ దేవ్ కానీ.. ఇటు మెగా కుటుంబం కానీ ఏం స్పందించడం లేదు. అసలు దీనికి కారణమే శ్రీజ.. ఎందుకంటే తన పేరు నుంచి భర్త కళ్యాణ్ పేరు తీసేయడంతో అసలు సమస్య మొదలైంది. ఇక రీసెంట్‌గా సూపర్ మచ్చి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఈ మధ్యే తన మేకోవర్‌ లుక్‌ని షేర్‌ చేసిన కల్యాణ్‌ దేవ్‌ దీనికి నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్‌. నీకు నచ్చింది నువ్వు చెయ్‌ అంటూ కొటేషన్‌ను యాడ్‌ చేశాడు. దీంతో అనేక అనుమ‌నాలు మొద‌ల‌య్యాయి.

అయితే శ్రీజ, కళ్యాణ్ దేవ్‌లకు నవిష్క అనే పాప పుట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నవిష్క సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. తన తండ్రి బర్త్ డేకు నవిష్క స్పెషల్ విషెస్ చెప్పింది. అటు శ్రీజ గానీ, శ్రీజ పెద్ద కూతురు నివృత్తి గానీ కళ్యాణ్ దేవ్ బర్త్ డేకు రియాక్ట్ అవ్వలేదు. కేవలం నవిష్క సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియో కనిపించింది. ఆ వీడియోకు కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరూ స్పందించారు. ఇద్దరూ కూడా ఒకే విధంగా రియాక్ట్ అయ్యారు. నవిష్క ఇచ్చిన పోజులను చూసి శ్రీజ, కళ్యాణ్ ఇద్దరూ మురిసిపోయారు. లిటిల్ పోజర్ అని శ్రీజ రియాక్ట్ అయితే.. కళ్యాణ్ దేవ్ మాత్రం పోజ్ పోజ్ పోజ్ అంటూ తన స్టోరీలో పోస్ట్ పెట్టేశాడు. ఈ ఇద్దరూ విడిపోయినా కూడా పాప కోసం క‌లుస్తారేమోన‌ని అంటున్నారు. హృతిక్ రోష‌న్ దంప‌తులు అలాంటి ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్న‌విష‌యం తెలిసిందే. మ‌రి వీరి విడాకులు విష‌యం రానున్న రోజుల్లో అయినా ఒక కొలిక్కి వస్తుందో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment