Jabardasth : జ‌బ‌ర్ద‌స్త్ షోలో ఇక‌పై రోజా స్థానాన్ని భ‌ర్తీ చేయ‌నుంది.. ఆమెనే..?

April 11, 2022 8:11 PM

Jabardasth : న‌గరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా హీరోయిన్ గా ఎన్నో ఏళ్ల పాటు అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఆమె వెలుగొందారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత వైసీపీలోకి మారిన తర్వాత కానీ.. ప్రత్యర్థులపై ఆమె విరుచుకుపడిన తీరు ఒక రేంజ్ లో ఉంటుంది. మంత్రి ప‌ద‌వి దక్కించుకున్నందుకు ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేశారు. మినిస్టర్ అయినందుకు షూటింగ్‌లు మానేస్తున్నానని చెప్పారు. టీవీ, సినిమా షూటింగ్‌లు ఇక చెయ్యనని.. ఇకపై జబర్దస్త్‌ షోలో కూడా పాల్గొనని చెప్పారు. మంత్రిగా సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేలా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పారు.

Jabardasth show Laila may act as judge in place of Roja
Jabardasth

అయితే జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇక‌పై రోజా తాను క‌నిపించ‌బోన‌ని చెప్పేశారు. దీంతో ఆ స్థానంలో మహిళా జ‌డ్జిగా ఎవ‌రు వ‌స్తారనే విష‌యంపై అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ఒక పేరు అయితే బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఎగిరే పావురమా సినిమాతోపాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్ లైలా ఇకపై జబర్ధస్త్ జడ్జిగా వ్యవహరిస్తుందనే సంకేతం ఇచ్చింది మల్లెమాల ఎంటర్‌టైనమెంట్స్.

ఇటీవ‌ల విడుద‌లైన ప్రోమోలో రోజాతోపాటు నటి ఆమని, లైలాకు కంటెస్టెంట్స్ చేసే స్కిట్‌లను ఎలా రిసీవ్ చేసుకోవాలి.. ఎలా కామెంట్ చేయాలి.. ఎలా కాంప్లిమెంట్ ఇవ్వాలనే విషయాలపై రోజా ట్రైనింగ్ ఇచ్చారు. ఇంకా గమ్మత్తేంటంటే ఈ ప్రోమోలో ఆమని నువ్వు జడ్జిగానే ఉన్నావుగా మళ్లీ ఎందుకు అని రోజా అంటే నేను బాగా చేస్తే లైలాను ఎందుకు పిలుస్తారని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే ఆమె పొజిషన్‌లో సొట్ట బుగ్గల హీరోయిన్ లైలా నెక్స్ట్ జడ్జి అని తేలిపోయింది.

లైలా కాదంటే ఆమ‌ని, ఇంద్ర‌జ కూడా రోజా స్థానాన్ని ఆక్ర‌మించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో రోజాకు కాస్త అనారోగ్యం చేయటం వల్ల ఆ స్థానాన్ని నటి ఇంద్రజ భర్తీ చేశారు. ఇక రోజా కోలుకున్న అనంతరం తిరిగి ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇంద్రజ ఈ కార్యక్రమంలో ఉన్నన్ని రోజులు మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే రోజా తిరిగి ఈ కార్యక్రమానికి రావడంతో ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు రోజా త‌ప్పుకుంటే ఆ స్థానాన్ని ఇంద్ర‌జ కూడా ఆక్ర‌మించే ఛాన్స్ ఉంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. అయితే నూటికి నూరు శాతం లైలానే ఈ షోకు జ‌డ్జిగా వ‌స్తుంద‌ని అంటున్నారు. ఇక మ‌రి ఆ స్థానంలోకి ఎవ‌రు వ‌స్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment