డెబిట్ కార్డుల‌ను వాడడం లేదా ? అయితే బ్లాక్ అవుతాయి జాగ్ర‌త్త‌..!

May 21, 2021 2:23 PM

సాధార‌ణంగా కొంద‌రికి ఒక‌టి క‌న్నా ఎక్కువ బ్యాంకుల‌కు చెందిన డెబిట్ కార్డులు ఉంటాయి. అయితే వారు ఆ కార్డుల్లో కొన్ని కార్డుల‌నే వాడుతుంటారు. కొన్నింటిని వాడ‌రు. కానీ ఈ విష‌యం తెలిస్తే వారు డెబిట్ కార్డుల‌ను ఎక్కువ‌గా వాడుతారు. ఎందుకంటే.. డెబిట్ కార్డుల‌ను అస‌లు వాడ‌క‌పోతే అలాంటి కార్డుల‌ను బ్లాక్ చేయాల‌ని త్వ‌ర‌లో ఆదేశాలు రానున్నాయి. అవును.. ఆర్‌బీఐ ఈ దిశ‌గా ఉత్త‌ర్వులు జారీ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

if you not use debit cards they will be blocked

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ త్వ‌ర‌లోనే డెబిట్ కార్డుల‌కు సంబంధించి కీల‌క ఉత్త‌ర్వుల‌ను జారీ చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. డెబిట్ కార్డుల‌ను వాడ‌క‌పోతే అలాంటి కార్డుల‌ను బ్లాక్ చేయాల్సిందిగా బ్యాంకుల‌కు ఆదేశాలు జారీ చేస్తుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే వినియోగ‌దారులు వాడ‌ని త‌మ డెబిట్ కార్డుల‌ను ఇప్ప‌టికైనా వాడాల‌ని బ్యాంకులు సూచిస్తున్నాయి.

ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ ఈ విష‌య‌మై ఇప్ప‌టికే త‌న ఖాతారుదాల‌కు మెసేజ్‌లు, మెయిల్స్ కూడా పంపిస్తోంది. వాడ‌ని డెబిట్ కార్డుల‌ను బ్లాక్ చేస్తామ‌ని, క‌నుక వాటితో ట్రాన్సాక్ష‌న్స్ చేయాల్సి ఉంటుంద‌ని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. త్వ‌ర‌లోనే ఇత‌ర బ్యాంకులు కూడా ఈ విష‌య‌మై ప్ర‌క‌ట‌న‌లు చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment