Viral Photo : బాబోయ్‌.. ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో అంద‌రూ చూస్తుండ‌గానే.. ఆ ప‌ని కానిచ్చేశారు..!

April 4, 2022 12:29 PM

Viral Photo : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2022 ఎడిషన్ రాను రాను ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ఆరంభంలో చ‌ప్ప‌గా ఉన్నా.. మ్యాచ్‌లు జ‌రుగుతున్న కొద్దీ ఈ లీగ్‌పై ఆస‌క్తి పెరుగుతోంది. ఇక క‌రోనా ప్ర‌భావం త‌గ్గుతుండ‌డంతో స్టేడియంల‌లోకి మ‌రింత మంది ప్రేక్ష‌కుల‌ను కూడా అనుమ‌తిస్తున్నారు. అయితే స్టేడియాల‌లోకి వ‌చ్చే ప్రేక్ష‌కులు కొంద‌రు చేస్తున్న పనులు కెమెరా కంట ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే అలాగే ఓ జంట కూడా కెమెరాకు చిక్కింది. అయితే వారు సాధార‌ణంగా కూర్చుని కాదు.. ముద్దు పెట్టుకుంటూ.. కెమెరాకు చిక్కారు.

Viral Photo couple caught on camera during IPL match
Viral Photo

శ‌నివారం గుజ‌రాత్ టైటాన్స్‌కు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ ఇన్నింగ్స్ 5వ ఓవ‌ర్ స‌మ‌యంలో ఓ జంట స్టాండ్స్‌లో కూర్చుని ముద్దు పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు. ఈ క్ర‌మంలోనే వారు ముద్దు పెట్టుకుంటున్న‌ప్పుడు తీసిన ఫొటో వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు స్టేడియాల‌కు వ‌స్తున్నారా.. లేక ముద్దులు పెట్టుకోవడానికా.. ఇంకా ఎక్క‌డా ప్లేస్ లేదా.. అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ ఫొటోకు స్పందించిన ప్ర‌ముఖ ఎంట‌ర్‌ప్రిన్యూర్ చిరాగ్ భ‌ర్జ‌త్య‌.. ఐపీఎల్‌లో కిస్ కెమెరాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని చ‌మ‌త్క‌రిస్తూ కామెంట్ చేశారు. దీంతో ఆయ‌న కామెంట్స్ కూడా వైర‌ల్ అవుతున్నాయి. దీనికి నెటిజన్లు కూడా స్పందించారు. అవును.. మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేసేందుకే కాకుండా.. ఇలాంటి సీన్ల‌ను కాప్చ‌ర్ చేసేందుకు కిస్ కెమెరాల‌ను కూడా ఏర్పాటు చేయాలని.. నెటిజ‌న్లు కోరుతున్నారు. ఇక ఈ ఫొటో అనేక సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now