Rahul Sipligunj : నిజం చెబుతున్నా.. డ్ర‌గ్స్ ఎలా ఉంటాయో కూడా తెలియ‌దు.. రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్‌..

April 4, 2022 9:59 AM

Rahul Sipligunj : రాడిసన్ బ్లూ హోటల్‌లో ఆదివారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో జరిగిన దాడుల్లో దాదాపు 150 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాట‌ర్ నిహారిక‌ కూడా ఉన్నారు. ఊహించని ఈ దాడిలో సదరు పబ్‌ నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు టాస్క్‌ఫోర్స్ అధికారులు. మొత్తం 150 మంది యువతీయువకులు ఈ పార్టీలో పాల్గొన్నారని, అందులో చాలామంది బడా బాబుల పిల్లలున్నారని తెలుస్తోంది. అయితే రాహుల్‌, నిహారికలు సెల‌బ్రిటీలు కావ‌డంతో వారి పేర్లు ఎక్కువ‌గా హైలైట్ అయ్యాయి.

Rahul Sipligunj explained about drugs case
Rahul Sipligunj

డ్రగ్స్ వద్దంటూ సందేశం ఇస్తున్న రాహులే.. ఇప్పుడు డ్రగ్స్ పార్టీలో పోలీసులకు దొరికిపోవడం సంచలనంగా మారింది. రాహుల్ వ్యవహారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ప్రతిష్టను మసకబారుస్తోంది. అయితే పోలీస్ స్టేష‌న్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత రాహుల్ అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని వివ‌రించాడు. పోలీసుల దాడులకు అరగంట ముందు పబ్ కు వెళ్లానని, స్నేహితులను పలకరించి వచ్చేద్దామనుకున్నానని వివరించాడు. ఈ వ్యవహారాన్ని డ్రగ్స్ కేసు అంటున్నారని, ఆధారాలు ఉంటే డ్రగ్స్ తీసుకున్నవాళ్లనో, పబ్ మేనేజర్ నో పట్టుకోవాలని అన్నాడు.

నేను డ్రగ్స్ తీసుకున్నాననడం అవాస్తవం. కావాలంటే డీఎన్ఏ టెస్టుకు నా శాంపిల్స్ ఇస్తాను. పోలీసులు నిర్వహించే డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే నేను ఎలా డ్రగ్స్ తీసుకుంటాను ? అన్నా, నిజం చెబుతున్నా.. ఇంతవరకు నాకు డ్రగ్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఒక్కసారి కూడా వాటిని చూడలేదు. నేను పబ్ నుంచి వచ్చే సమయంలో పోలీసులు ఆపారు. వాళ్లు ఎందుకు ఆపారో ఆ సమయంలో నాకు తెలియలేదు. ఎవరో ఇద్దరి ముగ్గురి వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చిందని పేర్కొన్నాడు రాహుల్‌ సిప్లిగంజ్‌. లేట్‌ నైట్‌ వరకు పబ్‌ నిర్వహిస్తుంటే యాజమాన్యాన్ని నిలదీయాలి. కానీ ఇలా మమ్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ కేసులో పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిచినా వెళ్తామని, ఈ డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేనప్పుడు తాను భయపడాల్సిన పని లేదని తెలిపాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment