Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇష్ట‌ప‌డే తెలుగు హీరో అతనే.. ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు..!

April 4, 2022 8:30 AM

Rakul Preet Singh : తెలుగు ఆడియ‌న్స్ కు పరిచయం అక్కర్లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఒక‌ప్పుడు తెలుగులో ర‌చ్చ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు అవ‌కాశాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. కొన్నేళ్ల‌ పాటు టాలీవుడ్ ను ఏలిన ఈ సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజియెస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది. గత కొంతకాలంగా వరుస హిందీ సినిమా ఆఫర్లు అందుకుంటూ.. బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది ఈ భామ. అయితే జాన్ అబ్రహాంతో రకుల్ నటించిన ఎటాక్.. ఏప్రిల్ 1న విడుదల అయింది.

Rakul Preet Singh told about her favourite actor in Telugu
Rakul Preet Singh

జాన్ అబ్రహాం ఇతర సినిమాలలాగే ఎటాక్ కూడా ఒక యాక్షన్ డ్రామా మూవీ. అయితే ఈ సినిమాలో రకుల్ ఒక సైంటిస్ట్‌గా కనిపించగా, ఆ పాత్ర కోసం తాను చాలా కసరత్తు చేసినట్టు రకుల్ తెలిపింది. ల్యాబ్‌లో తనకు అలవాటు అవ్వడానికే రెండు, మూడు రోజులు పట్టిందట. తాను ఒక సైంటిస్ట్‌గా అక్కడ ఉన్న పరికరాలు అన్నీ అలవాటు ఉన్నట్టు నటించడానికి చాలా కష్టపడ్డానంటూ తెలిపింది రకుల్. ఇక ర‌కుల్ ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. వెరైటీ డ్రెస్సుల‌లో నానా ర‌చ్చ చేస్తూ భీబ‌త్సం సృష్టిస్తోంది. తాజాగా క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్స్ సెష‌న్‌లో పాల్గొన్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను తెలుగులో మీ ఫేవ‌రేట్ యాక్ట‌ర్ ఎవర‌ని ప్ర‌శ్నించాడు ఓ నెటిజ‌న్.

దానికి అల్లు అర్జున్ అని స‌మాధాన‌మిచ్చింది ర‌కుల్‌. స‌రైనోడు సినిమాలో అల్లు అర్జున్‌తో ర‌కుల్ జ‌త‌క‌ట్ట‌గా.. ఆ సినిమా పెద్ద విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. గ‌తేడాది వైష్ణ‌వ్‌తేజ్‌-క్రిష్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కొండ‌పొలం సినిమాలో మెరిసింది ర‌కుల్‌. ప్ర‌స్తుతం 31అక్టోబ‌ర్ లేడీస్ ఫైట్ అనే తెలుగు సినిమా చేస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో తెర‌కెక్కుతుందీ సినిమా. అలాగే ఈ అమ్మ‌డి ఖాతాలో అర‌డ‌జ‌నుకి పైగా హిందీ సినిమాలు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment