Rashmika Mandanna : వర్కౌట్ డ్రెస్సులో పిచ్చెక్కిస్తున్న రష్మిక మంద‌న్న‌..!

March 27, 2022 5:51 PM

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక ఫిట్‌నెస్‌ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాద‌నే విషయం మనకు తెలిసిందే. తన ఫిట్‌నెస్‌ కోసం ఎక్కువగా కష్టపడుతూ భారీ వర్కౌట్స్ చేస్తూ అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది.

Rashmika Mandanna latest work out photo trending
Rashmika Mandanna

ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్న‌ రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. రష్మిక జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న సమయంలో మిర్రర్ లో సెల్ఫీ దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలో టైట్ పాయింట్ వేసుకొని అసలైన నడుము అందాలను చూపిస్తూ సెల్ఫీ దిగింది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. స్థిరత్వంతో, వర్కౌట్‌తో, ఫిజియోతో, డైట్‌తో, ఆలోచనలతో, మీ ప్రయాణంతో స్థిరంగా ఉండండి, ఎంజాయ్‌ చేయండి.. అంటూ చెప్పుకొచ్చింది. ఇలా గ్లామరస్ ఫొటోల ద్వారా అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజులు ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోల‌ను చూస్తూ పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment