Aditi Rao Hydari : త‌న అందం వెనుక ఉన్న సీక్రెట్స్ ఏమిటో చెప్పేసిన‌.. అదితి రావు హైద‌రి..!

March 24, 2022 5:37 PM

Aditi Rao Hydari : తన అందం, అభినయంతో అదితి రావు హైదరి ఎంతో మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. చెలియా, వి, మహా సముద్రం వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు చూసినా మెరిసే రంగుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా నిత్యం యవ్వనంగా కనిపించడం కోసం ఈమె ఏ విధమైనటువంటి బ్యూటీ టిప్స్ పాటిస్తుంద‌నే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఇందుకు ఆమె స‌మాధానం చెప్పేసింది.

Aditi Rao Hydari told her beauty secrets
Aditi Rao Hydari

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి మొదటిసారిగా తన బ్యూటీ సీక్రెట్ గురించి ఓపెన్ గా వెల్లడించింది. తనఅందాన్ని రెట్టింపు చేసే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ.. తాను సహజసిద్ధంగా లభించే సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తానని తెలిపింది. షూటింగ్ లేని సమయంలో తాను ఏ విధమైనటువంటి మేకప్ లేకుండా ఉంటానని ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తప్ప మరే ఇతర బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించనని తెలిపింది.

ఇక సెల్ఫీలకు పోజులు ఇచ్చే సమయంలో తాను ఎలాంటి ఫిల్టర్ ఉపయోగించ‌నని తనకు నాచురల్ గా ఉండటమే ఇష్టం అని తెలిపింది. ఇక షూటింగ్ సమయంలో షూటింగ్ పూర్తి కాగానే తనకు మేకప్ రిమూవ్ చేసుకోవడం అలవాటు ఉందని, రాత్రి పడుకునే ముందు కూడా మేకప్ రిమూవ్ చేసి పడుకుంటానని తెలిపింది. అలాగే ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసిన బ్యూటీ ఆయిల్ రాయటం వల్ల తన చర్మం ఎంతో కాంతివంతంగా మెరుస్తుందని ఈ ముద్దుగుమ్మ త‌న అందం వెనుక దాగి ఉన్న సీక్రెట్ ను బయట పెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment