SS Rajamouli : దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

March 16, 2022 4:34 PM

SS Rajamouli : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి శాంతినివాసం అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.

do you know how many assets SS Rajamouli  have
SS Rajamouli

ఈ విధంగా డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. మొదటి సినిమానే ఎంతో మంచి విజయం అందుకోవడంతో ఈయన వరుస సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకొని ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఒక్కో సినిమాకు రూ.కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే రాజమౌళి ఆస్తులను కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

రాజమౌళి ఆస్తుల విషయానికి వస్తే ఈయనకు ఏకంగా రూ.200 కోట్ల వరకు ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం. గడిచిన మూడు సంవత్సరాలలో ఈయన ఆస్తి సుమారుగా 40 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌లో పలుచోట్ల విలువైన ఆస్తిపాస్తులతోపాటు ఖరీదైన బంగ్లాలు, కార్లు కూడా ఉన్నాయి. ఒకప్పుడు సినిమాకి రూ.కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే జక్కన్న ప్రస్తుతం ఒక్కో సినిమాకి లాభాలలో 30 శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now