Radhe Shyam : రాధేశ్యామ్ సినిమా ఓటీటీలో.. ఎందులోనో తెలుసా ?

March 15, 2022 12:10 PM

Radhe Shyam : రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డె హీరోహీరోయిన్లుగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి ప్రేక్షకులను సందడి చేస్తోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ కథలో ప్రభాస్ హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

Radhe Shyam movie will stream on OTT
Radhe Shyam

కాగా థియేటర్ లలో విడుదలైన తర్వాత ప్రతి ఒక్క సినిమా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై అలరించేందుకు సిద్ధమైంది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ భారీ ధరకు దక్కించుకున్నట్టు సమాచారం. దీంతో త్వరలోనే అమెజాన్‌లో ఈ సినిమా స్ట్రీమ్‌ కానుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక వివరాలను ప్రకటించనున్నారు.

ఇక ఈ సినిమా థియేటర్లో విడుదల అయినప్పటికీ థియేటర్ లో చూడలేనివారు ఇకపై అమెజాన్ ద్వారా ఈ సినిమాను చూడవచ్చు. సినిమా థియేటర్ లో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన విడుదల అయింది కనుక ఈ సినిమాని ఏప్రిల్ 2వ తేదీన ఉగాది పండుగ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు స్ట్రీమింగ్‌ చేయాలని అమెజాన్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజుల వరకు వేచి చూడక తప్పదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment