Anchor Suma : అంద‌రి ముందే సుమ‌కు ఐ ల‌వ్ యూ చెప్పిన న‌రేష్‌.. సుమ రియాక్ష‌న్ ఇదీ..!

March 10, 2022 2:32 PM

Anchor Suma : సుమ వ్యాఖ్యాతగా బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ విశేషమైన ప్రేక్షకాదరణ పొందాయి. ఈ క్రమంలోనే శనివారం సుమ క్యాష్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటుంది. ఇక ఈ శనివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ హాజరైనట్లు తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది వైరల్ గా మారింది.

Jabardasth Naresh proposed love to Anchor Suma
Anchor Suma

ఇక ఎప్పటిలాగే తనదైన శైలిలో జబర్దస్త్ కమెడియన్స్ పై సుమ పంచులు వేస్తూ ప్రేక్షకులను సందడి చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన పొట్టి నరేష్ సుమ దగ్గరకు వెళ్లి మిమ్మల్ని చూడగానే నా మనసులో ఏదో అవుద్ది అంటూ సుమకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అయితే మొదటగా గులాబీ పువ్వు తీసుకున్న సుమ ఆపై పొట్టి నరేష్ ప్రపోజల్ కి రియాక్ట్ అవుతూ తనదైన శైలిలో పంచ్ వేసింది.

గులాబీ పువ్వు చేతిలోకి తీసుకున్న సుమ.. పోరా జఫ్ఫా.. మా ఆయన చూస్తే నిన్ను ఇక్కడే పాతిపెట్టి నీకు సమాధి కట్టి నీ సమాధిపై రోజా పువ్వు పెడతాడు.. అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అవుతూ పంచ్ వేసింది. అయితే పొట్టి నరేష్ తర్వాత స్టేజ్ పై నుంచి కిందపడ‌డం.. ఆంబులెన్స్ రావడం.. వంటి సీన్లతో ఈ ప్రోమో కట్ చేశారు. నిజంగానే పొట్టి నరేష్ కిందపడిపోయాడా.. లేకపోతే ప్రోమోలో భాగంగా ఇలా చేశారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment