పావలా శ్యామల ప్రస్తుత పరిస్థితి తెలిస్తే.. కన్నీళ్లాగవు..

May 17, 2021 8:15 PM

తెలుగు ఇండస్ట్రీలో కొంత మంది ఆర్టిస్టులు తన హావభావాలతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో పావలా శ్యామల ఒకరు.ముఖ్యంగా ‘బాబాయ్ హోటల్’ ‘వర్షం’, ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘గోలిమార్’ వంటి సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఒకప్పుడు ఎంతో మందిని తన హాస్యంతో నవ్వించిన పావలా శ్యామల ఇప్పుడు ఎంతో దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఒక వైపు వయసు పైబడటమే కాకుండా, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో తీవ్ర సతమతమవుతున్నారు. ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో వయసుపైబడిన వారు లేకుండా సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలపైనే తన జీవనోపాధి ఆధారపడిన శ్యామల ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందిస్తుంది. అయితే అది తన మందులకే సరిపోతుందని ఆమె తన బాధను వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే ఆమె పరిస్థితి తెలుసుకున్న మా అసోసియేషన్ సంస్థవారు ఈమెకు ఆర్థిక సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. పావలా శ్యామల దయనీయ పరిస్థితిని తెలుసుకున్న కరాటే కళ్యాణి తనవంతు సాయంగా ఆమెకు కొంత ఆర్థిక సహాయం చేశారు.ప్రస్తుతం పావలా శ్యామలతో పాటు తన కూతురు కూడా అనారోగ్యంతో బాధ పడటంతో ఈమె ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now