Sai Pallavi : సాయిప‌ల్ల‌వి.. లేడీ ప‌వ‌న్ క‌ల్యాణ్.. ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌శంస‌లు..

February 28, 2022 11:32 AM

Sai Pallavi : శర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం.. ఆడాళ్లూ మీకు జోహార్లు. ఈ సినిమా మార్చి 4వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు చెందిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కుడు సుకుమార్‌, న‌టి సాయిప‌ల్ల‌విలు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సుకుమార్ మాట్లాడుతూ సాయిప‌ల్ల‌విని అభినందించారు.

Sai Pallavi is lady pawan kalyan says sukumar
Sai Pallavi

సాయిప‌ల్ల‌వి ఒక గొప్ప న‌టి అని.. అలాగే ఆమె ఎంతో మంచి మ‌న‌స్సు ఉన్న మ‌నిషి అని.. మాన‌వ‌త్వం చూపిస్తుంద‌ని.. సుకుమార్ కొనియాడారు. ఆమె గ‌తంలో ఓ ఫెయిర్‌నెస్ క్రీమ్ యాడ్‌లో న‌టించ‌బోన‌ని తేల్చి చెప్పింద‌ని.. త‌న‌కు అలాంటి యాడ్స్ చేయ‌డం ఇష్టం లేద‌ని చెప్పింద‌ని.. వారు డ‌బ్బు బాగా ఇస్తామ‌న్నా ఆమె నో చెప్పింద‌ని.. అన్నారు. అలాంటి గొప్ప మ‌నిషి సాయిప‌ల్ల‌వి అని అన్నారు.

ఇక సాయి ప‌ల్ల‌విని సుకుమార్ లేడీ ప‌వ‌న్ క‌ల్యాణ్ అని అన్నారు. దీంతో ప్రేక్ష‌కులు చప్ప‌ట్లు కొట్టి ప్రాంగ‌ణాన్ని మోత మోగించారు. కాగా సాయిప‌ల్ల‌వి ఈ మ‌ధ్యే న‌టించిన ల‌వ్ స్టోరీ, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాలు హిట్ అయ్యాయి. త్వ‌ర‌లో ఈమె విరాట ప‌ర్వం అనే సినిమాలో కనిపించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment