Rashmika Mandanna : బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో మెరిసిపోతున్న ర‌ష్మిక మంద‌న్న‌..!

February 21, 2022 5:27 PM

Rashmika Mandanna : పుష్ప సినిమాతో ర‌ష్మిక మంద‌న్న స్టార్ డ‌మ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలోనే ఈమెకు బాలీవుడ్‌లో అనేక అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఈమె ఓ వైపు హిందీ సినిమాల్లో న‌టిస్తూనే మరో వైపు తెలుగులోనూ యాక్ట్ చేస్తోంది. ఇక ఈమె తెలుగులో రీసెంట్‌గా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను పూర్తి చేసింది. ఇందులో శ‌ర్వానంద్ హీరోగా న‌టించాడు. ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

Rashmika Mandanna  latest black color dress photos
Rashmika Mandanna

ర‌ష్మిక మంద‌న్న సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఓ వైపు ప‌లు బ్రాండ్ల‌కు చెందిన ఉత్ప‌త్తుల‌ను ఈమె ప్ర‌మోట్ చేస్తూనే.. మ‌రోవైపు గ్లామ‌ర‌స్ ఫొటోషూట్స్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ అమ్మ‌డు చేసిన బ్లాక్ డ్రెస్ ఫొటోషూట్ అదిరిపోయింది. ఇందులో ర‌ష్మిక అందాలు వ‌ర్ణించ‌న‌ల‌వి కాకుండా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

ర‌ష్మిక ప్ర‌స్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌లో పాల్గొన‌నుంది. అలాగే హిందీలోనూ ప‌లు మూవీల్లో న‌టిస్తోంది. అవి ఈ ఏడాది చివ‌ర్లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment