Actress Pragathi : ఎరుపు రంగు చీర‌లో మెరిసిపోయిన న‌టి ప్ర‌గ‌తి..!

February 11, 2022 10:30 PM

Actress Pragathi : తెలుగు వెండితెర‌పై న‌టిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్న ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సినిమాల్లో న‌టించ‌క‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. లేటెస్ట్ సినిమాల‌కు చెందిన ప‌లు సాంగ్స్‌కు ఈమె స్టెప్పులు వేస్తూ అల‌రిస్తుంటుంది. అలాగే ఆ డ్యాన్స్‌ల‌కు చెందిన వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. దీంతో నెటిజ‌న్లు వాటిని ఆస‌క్తిగా వీక్షిస్తుంటారు.

Actress Pragathi red color saree photos viral
Actress Pragathi

పుష్ప సినిమాలో స‌మంత న‌టించిన ఊ అంటావా.. పాట ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అయితే న‌టి ప్ర‌గ‌తి ఆ పాట‌కు ఇటీవ‌ల స్టెప్పులేసి అల‌రించింది. అలాగే ఈమె ఎప్ప‌టిక‌ప్పుడు జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ వాటికి తాలూకు వీడియోల‌ను షేర్ చేస్తుంటుంది. ఇంత వ‌య‌స్సు వ‌చ్చినా ఆమె అంత అందంగా క‌నిపిస్తుండ‌డానికి కార‌ణం ఆమె ఫిట్‌నెస్సే అని చెప్ప‌వ‌చ్చు.

ఇక సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, నేహా శెట్టి న‌టించిన డీజే టిల్లు మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇందులో న‌టి ప్ర‌గ‌తి కూడా యాక్ట్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి చెందిన ప్రీ రిలీజ్ వేడుక‌ను ఇటీవ‌లే నిర్వ‌హించారు. ఈ వేడుక‌కు ప్ర‌గ‌తి హాజ‌రైంది.

డీజే టిల్లు ప్రీ రిలీజ్ వేడుక‌కు హాజ‌రైన న‌టి ప్ర‌గతి అంద‌రినీ త‌న‌వైపుకు తిప్పుకునేలా చేసింది. ఎరుపు రంగు చీర ధ‌రించి త‌ళుక్కున మెరిసింది. దీంతో అంద‌రూ ఆమెనే ఆస‌క్తిగా తిల‌కించారు. ఇక ఈ ఈవెంట్‌కు హాజ‌రైనప్పుడు తీసిన ఈమె ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. అంద‌రూ ప్ర‌గ‌తి అందం చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment