Urvashi Rautela : నటి ఊర్వశి రౌతెలాకు నెటిజన్ల చిలిపి ప్రశ్న..? ఏం చూడమంటావ్‌.. అంటూ..!

February 11, 2022 6:38 PM

Urvashi Rautela : బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. తరువాత స్టార్‌ నటిగా మారింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు పలు సినిమాల్లోనూ నటించింది. 2013లో రిలీజ్‌ అయిన సింగ్‌ సాబ్‌ ది గ్రేట్‌ సినిమాతో ఈమె ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Urvashi Rautela shared her painting netizens asked a question
Urvashi Rautela

నటి ఊర్వశి రౌతెలా అందాలను ఆరబోయడంలో ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ఎప్పటికప్పుడు గ్లామరస్‌ ఫొటోషూట్స్‌ చేస్తూ అలరిస్తుంటుంది. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తుంటుంది. ఈ అమ్మడి అందాల ఆరబోత ఒక రేంజ్‌లో ఉంటుంది. ఈమె ఫొటోలను చూసి నెటిజన్లు షాక్‌ తింటుంటారు. ఇక తాజాగా ఈమె ఓ పెయింటింగ్‌ వేస్తూ ఫొటో దిగి దాన్ని షేర్‌ చేసింది. అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ ఫొటోలో ఊర్వశి రౌతెలా గ్లామరస్‌ డ్రెస్‌ వేసుకుంది. వెనుక భాగం కనిపించేలా ఫొటో దిగింది. అందులో ఆమె బ్రా కనిపిస్తోంది. అయితే ఈ ఫొటోను షేర్‌ చేసిన ఆమె ఓ క్యాప్షన్‌ను కూడా పెట్టింది. తాను ఎక్కడ ఉన్నానో గుర్తించాలని కామెంట్‌ చేసింది. అయితే ఇందుకు నెటిజన్లు చిలిపిగా స్పందించారు.

పెయింటింగ్‌ వేసే సమయంలో కూడా అందాల ప్రదర్శన చేయాలా.. ఇలాంటి డ్రెస్‌ వేసుకోకపోతే ఏమైనా అవుతుందా.. అయినా నువ్వు వేసే పెయింటింగ్‌ ను చూడాలా.. లేక నీ బ్రాను చూడాలా.. ఏం చూడమంటావ్‌.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now