Airtel : ఎయిర్‌టెల్ బంప‌ర్ ఆఫర్‌.. 15 ఓటీటీ యాప్‌ల సేవ‌లు.. నెల‌కు కేవ‌లం రూ.149 మాత్ర‌మే..!

February 11, 2022 12:04 PM

Airtel : టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న వినియోగ‌దారుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌కటించింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ద్వారా 15 ఓటీటీ యాప్‌ల‌కు చెందిన సేవ‌ల‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌పై నెల‌కు కేవ‌లం రూ.149కే అందిస్తున్న‌ట్లు తెలియ‌జేసింది. ఇందుకు గాను క‌స్ట‌మ‌ర్లు ఏడాదికి అయితే రూ.1499 చెల్లించ‌వ‌చ్చు.

Airtel offers 15 OTT apps services in xstream premium platform
Airtel

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాప్ ద్వారా ఎయిర్‌టెల్ వినియోగ‌దారులు 15 ఓటీటీ యాప్‌ల‌కు చెందిన కంటెంట్‌ను వీక్షించ‌వ‌చ్చు. అందులో భాగంగానే సోనీ లివ్‌, ఈరోస్ నౌ, ల‌య‌న్స్ గేట్ ప్లే, హోయ్ చోయ్‌, మనోర‌మా మ్యాక్స్‌, షెమారూ, అల్ట్రా, హంగామా ప్లే, ఎపికాన్‌, డాక్యుబే, దివో టీవీ, క్లిక్‌, న‌మ్మ ఫ్లిక్స్‌, డాలీవుడ్‌, షార్ట్స్ టీవీ ఓటీటీ యాప్‌లను ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాప్‌లో పొంద‌వ‌చ్చు.

ఇక ఈ యాప్‌ల‌లో ఏకంగా వినియోగ‌దారులు 10,500 మూవీలు, షోల‌ను వీక్షించ‌వ‌చ్చు. అయితే ఈ ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌, అమెజాన్ ప్రైమ్ రావ‌డం లేదు. వాటి కోసం ఎయిర్‌టెల్ ప్ర‌త్యేక ప్లాన్‌ల‌ను అందిస్తోంది.

ఒక‌టే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 15 ఓటీటీ యాప్‌ల‌కు చెందిన కంటెంట్‌ను వినియోగ‌దారులు సుల‌భంగా పొంద‌వ‌చ్చు. ఇక ఇందుకు గాను నెల‌కు కేవ‌లం రూ.149 చెల్లిస్తే చాలు. ఈ క్ర‌మంలోనే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సేవ‌ల‌ను మొబైల్స్‌, ట్యాబ్లెట్స్‌, ల్యాప్‌టాప్‌ల‌లో పొంద‌వ‌చ్చు.

కొత్త‌గా ఈ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఎయిర్ టెల్ మ‌రో 2 కోట్ల స‌బ్‌స్క్రిప్ష‌న్ల‌ను పొందాల‌ని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ నూత‌న ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment