Sonu Sood : దేవుడిలా వ‌చ్చి యువ‌కున్ని కాపాడిన సోనూసూద్‌.. హ్యాట్సాఫ్‌..!

February 9, 2022 5:15 PM

Sonu Sood : క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఎంతో మంది వ‌ల‌స కార్మికుల‌కు స‌హాయం అందించిన విష‌యం విదిత‌మే. ఆయ‌న ఎంతో మందిని సొంత ఊళ్ల‌కు వెళ్లేలా చేశారు. అలాగే రెండో వేవ్ స‌మ‌యంలో దేశ‌వ్యాప్తంగా అనేక చోట్ల ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేయించారు. ఇప్ప‌టికీ ఆయ‌న త‌న వ‌ద్ద‌కు వ‌చ్చే వారికి కాదు, లేదు.. అన‌కుండా స‌హాయం చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా సోనూసూద్ ఓ యువ‌కుడి ప్రాణాలు కాపాడి అంద‌రిచే మ‌రోమారు ప్ర‌శంస‌ల‌ను అందుకుంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే..

Sonu Sood rescued a 19 year old one like god
Sonu Sood

పంజాబ్‌లోని మోగా అనే ప్రాంతంలో రాత్రి పూట ఓ యువ‌కుడు (19) తీవ్ర‌మైన ప్ర‌మాదానికి గుర‌య్యాడు. ఫ్లై ఓవ‌ర్ కింద అత‌ని కారు రోడ్డు ప్ర‌మాదానికి గురైంది. కారు నుజ్జు నుజ్జ‌యింది. అయితే అదే స‌మ‌యంలో అటుగా వెళ్తున్న సోనూసూద్ వెంట‌నే స్పందించారు. యాక్సిడెంట్ అయిన కారు వ‌ద్ద‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఆ కారుకు సెంట్ర‌ల్ లాకింగ్ సిస్ట‌మ్ ఉంది. దీంతో అందులో చిక్కుకుపోయిన ఆ యువ‌కుడిని బ‌య‌ట‌కు తీసేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టింది. అయిన‌ప్ప‌టికీ సోనూసూద్ బాగా శ్ర‌మించి ఎట్ట‌కేల‌కు ఆ యువ‌కున్ని బ‌య‌టకు తీయించారు. అనంత‌రం వెంట‌నే ఆ యువ‌కుడిని స‌మీపంలో ఉన్న హాస్పిట‌ల్‌లో చేర్పించారు. ప్ర‌స్తుతం ఆ యువ‌కుడి ఆరోగ్యం బాగానే ఉంద‌ని, అత‌నికి చికిత్స‌ను అందిస్తున్నామ‌ని, అత‌ను కోలుకుంటున్నాడ‌ని.. వైద్యులు తెలిపారు. అయితే స‌మయానికి సోనూసూద్ హాస్పిట‌ల్ కు ఆ యువ‌కున్ని తీసుకు రావ‌డం వ‌ల్లే అత‌ను ప్రాణాపాయం నుంచి బ‌య‌ట ప‌డ్డాడ్డ‌ని వైద్యులు తెలిపారు. దీంతో సోనూసూద్‌ను మ‌రోమారు అంద‌రూ అభినందిస్తున్నారు. దేవుడిలా వ‌చ్చి కాపాడాడంటూ కొనియాడుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment