Mahesh Babu : మొన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇప్పుడు మహేష్ బాబు.. పోటీలు ప‌డి మ‌రీ కూల్ డ్రింక్ యాడ్స్‌..

February 4, 2022 8:09 PM

Mahesh Babu : శీత‌ల పానీయాల యాడ్స్ ఏమోగానీ హీరోలు పోటీ ప‌డి మ‌రీ యాడ్స్ చేస్తున్నారు. ఇటీవ‌లే రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ థమ్స్ అప్ యాడ్ ద్వారా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ఇక ఇప్పుడు మ‌హేష్ బాబు మౌంటెయిన్ డ్యూ యాడ్‌తో ముందుకు వ‌చ్చారు. గ‌తంలో మ‌హేష్ థ‌మ్స్ అప్ కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేవారు. కానీ ఇటీవ‌లే ఆయ‌న‌తో థ‌మ్స్ అప్ తెగ‌తెంపులు చేసుకుంది. కార‌ణం.. 3 ఏళ్ల కాలానికి గాను మ‌హేష్ అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ ను అడ‌గ‌డ‌మే అని చెప్ప‌వ‌చ్చు.

Mahesh Babu came with mountain dew ad
Mahesh Babu

థ‌మ్స్ అప్ యాడ్‌ల‌లో న‌టించేందుకు గాను గతంలో ఆ సంస్థ మ‌హేష్‌కు 3 ఏళ్ల కాలానికి గాను ఏకంగా రూ.8 కోట్ల‌ను ఇచ్చింద‌ట‌. అయితే ఇటీవ‌లే ఆ కాంట్రాక్టు గ‌డువు ముగిసింది. ఈ క్ర‌మంలో మ‌హేష్ రూ.10 కోట్లు అడిగార‌ట‌. కానీ థ‌మ్స్ అప్ అంత మొత్తం ఇవ్వ‌లేమ‌ని చెప్పింది. దీంతో ఆ సంస్థ‌తో మ‌హేష్ కాంట్రాక్టును ర‌ద్దు చేసుకున్నారు. త‌రువాత మౌంటెయిన్ డ్యూ సంస్థ మహేష్‌తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ఆయ‌న అడిగినంత మొత్తం ఇచ్చింది. దీంతో 3 ఏళ్ల కాలానికి గాను మ‌హేష్ కు మౌంటెయిన్ డ్యూ రూ.10 కోట్ల భారీ మొత్తం ఇవ్వ‌నుంద‌ని సమాచారం.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు థమ్స్ అప్ అదే 3 ఏళ్ల కాలానికి కాంట్రాక్టు ఇచ్చింది. ఈ క్రమంలోనే విజ‌య్‌కు 3 ఏళ్ల‌కు ఆ సంస్థ రూ.2.50 కోట్ల‌ను ఇవ్వ‌నుంది. ఇలా థమ్స్ అప్ త‌న ఖ‌ర్చును త‌గ్గించుకుంది. త‌మ‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ చాలు అని స‌రిపెట్టుకుంది. కానీ మౌంటెయిన్ డ్యూ మాత్రం క‌చ్చితంగా మహేష్ లాంటి పెద్ద స్టార్ కావాల‌ని నిర్ణ‌యించుకుంది. అందుక‌నే రూ.10 కోట్ల‌ను కూడా మహేష్ కు ఇచ్చేసింది. మ‌రి రెండు యాడ్‌ల‌లో ఎవ‌రి యాడ్ ఎక్కువ పాపుల‌ర్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment