Rakul Preet Singh : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఫుల్‌ బిజీ.. మరొక హిందీ సినిమాలో ఆఫర్‌..!

February 4, 2022 11:59 AM

Rakul Preet Singh : ఆ భాష.. ఈ భాష అనే తేడా లేకుండా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ దాదాపుగా అనేక భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె నటించిన అనేక చిత్రాలు హిట్‌ అయ్యాయి. దీంతో ఈమె ఓ దశలో వరుస ఆఫర్లతో బిజీ అయింది. అయితే ప్రస్తుతం ఇతర యంగ్‌ హీరోయిన్ల కారణంగా రకుల్‌ ప్రీత్‌కు ఆఫర్లు తగ్గాయనే చెప్పవచ్చు. కానీ తాజాగా ఈ అమ్మడు ఓ బాలీవుడ్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Rakul Preet Singh gets another offer in a Bollywood movie
Rakul Preet Singh

బాలీవుడ్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది. ఈమె నటించిన పలు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఇప్పుడీమెకు బాలీవుడ్‌ లో ఈ అవకాశం రావడం నిజంగా ఆమె అదృష్టమనే చెప్పవచ్చు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన న్యూ అవతార్ అనే హిందీ మూవీ త్వరలో విడుదల కానుంది. అలాగే జాన్‌ అబ్రహం, జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్లతో కలిసి రకుల్‌ నటించిన అటాక్‌ మూవీ కూడా త్వరలో విడుదల కానుంది. ఇక థాంక్‌ గాడ్‌ మూవీలో అజయ్‌ దేవగన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రాలతో కలిసి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించనుంది. ఈ క్రమంలో తెలుగులో ఈ భామకు అవకాశాలు అంతగా లేకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం ఫుల్‌ బిజీగా మారిందని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment