Bhimla Nayak : భీమ్లా నాయ‌క్ రిలీజ్ అవుతుందో, కాదో.. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యిస్తారు: నిర్మాత నాగ‌వంశీ

February 3, 2022 8:44 AM

Bhimla Nayak : క‌రోనా కార‌ణంగా అనేక పెద్ద సినిమాలు వాయిదా ప‌డిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఒక్క చిత్ర యూనిట్ త‌మ సినిమాను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ప‌లువురు మేక‌ర్స్ త‌మ చిత్రాల‌కు గాను కొత్త రిలీజ్ డేట్ల‌ను కూడా ప్ర‌క‌టించేశారు. అయితే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ చిత్రం విడుద‌ల‌పై అంద‌రిలోనూ సందేహాలు నెల‌కొన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ చిత్ర నిర్మాత ఎస్‌.నాగ‌వంశీ తాజాగా జ‌రిగిన మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

producer naga vamsi says cm jagan will decide on Bhimla Nayak release
Bhimla Nayak

నాగ వంశీ నిర్మాణంలో తెర‌కెక్కిన తాజా చిత్రం డీజే టిల్లు. ఈయ‌న భీమ్లా నాయ‌క్ నిర్మాత కూడా. డీజే టిల్లు మూవీ ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నాగ వంశీ మాట్లాడుతూ.. తాను భీమ్లా నాయ‌క్ చిత్రం విడుద‌ల కోసం ఎదురు చూస్తున్నాన‌ని అన్నారు.

భీమ్లా నాయ‌క్ విడుద‌ల‌కు గాను రెండు తేదీలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. ఫిబ్ర‌వ‌రి 25 లేదా ఏప్రిల్ 1వ తేదీన ఈ మూవీని విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నామ‌ని.. అయితే దీనిపై సీఎం జ‌గ‌న్‌ను అడిగితే బాగుంటుంద‌ని అన్నారు. ఆయ‌న నిర్ణ‌యంపైనే భీమ్లా నాయ‌క్ విడుద‌ల ఆధార‌ప‌డి ఉంద‌న్నారు. రాష్ట్రంలో 50 శాతం ఆక్యుపెన్సీ రూల్, రాత్రి క‌ర్ఫ్యూల‌ను ఎత్తేస్తేనే భీమ్లా నాయ‌క్ విడుద‌ల అవుతుంద‌ని తెలిపారు.

ఇక డీజే టిల్లు యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ అని, భీమ్లానాయ‌క్ మాస్ మూవీ అని అన్నారు. డీజే టిల్లు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అయితే.. భీమ్లా నాయ‌క్ ఆంధ్రా మీల్స్ వంటిద‌ని నాగ వంశీ అన్నారు. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ థియేట‌ర్ల విష‌యంలో తీసుకునే నిర్ణ‌యంపైనే భీమ్లా నాయ‌క్ విడుద‌ల ఆధార ప‌డి ఉంద‌ని స్ప‌ష్ట‌మైంది. మ‌రి భీమ్లా నాయ‌క్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment