Malavika Mohanan : నా ఫొటోల‌ను మార్ఫింగ్ చేస్తున్నారు.. మాళ‌విక మోహ‌న‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

February 2, 2022 3:55 PM

Malavika Mohanan : మ‌ళ‌యాళ బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మోడ‌ల్‌గా, న‌టిగా రాణిస్తున్న ఈమె అందాల‌ను ఆర‌బోయడంలో అంద‌రు హీరోయిన్స్ క‌న్నా ముందే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈమె ఇప్ప‌టికే ప‌లు మూవీల్లో న‌టించి అల‌రించింది. త‌మిళంలో వ‌చ్చిన హీరో విజ‌య్ సినిమా మాస్ట‌ర్‌లో ఈమె హీరోయిన్‌గా న‌టించి ఆక‌ట్టుకుంది.

Malavika Mohanan said her photos are being photoshopped
Malavika Mohanan

సోష‌ల్ మీడియాలో మాళ‌విక మోహ‌న‌న్ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తూ హీటెక్కిస్తుంటుంది. ఈ అమ్మ‌డి అందాల ఆర‌బోత ఒక రేంజ్‌లో ఉంటుంది. దీంతో చాలా మంది ఈమెకు ఫాలోవ‌ర్లు అయ్యారు.

ఎప్ప‌టిక‌ప్పుడు వెకేష‌న్స్‌కు వెళ్లే ఈమె అక్క‌డ దిగే ఫొటోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది. ఇటీవ‌లే ఈమె మాల్దీవ్స్‌లో వెకేష‌న్‌లో ఉండ‌గా.. బికినీ ధ‌రించి ఫొటోల‌ను దిగింది. వాటిని షేర్ చేయ‌గా.. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ భామ త‌న ఫొటోల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ త‌న ఫోటోల‌ను మార్ఫింగ్ చేసి త‌న సైట్‌లో ప్ర‌చురిస్తుంద‌ని ఆరోప‌ణ‌లు చేసింది. వేరే మోడ‌ల్స్‌కు త‌న ఫొటోల‌ను క‌లిపి మార్ఫింగ్ చేసి ఆ ఫొటోల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని, త‌న ఫొటోల‌ను ఫోటోషాప్ చేస్తున్నార‌ని.. ఆరోపించింది. దీంతో మాళ‌విక మోహ‌న‌న్ చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.

మాళ‌విక మోహ‌న‌న్ స‌హ‌జంగానే ఎల్ల‌ప్పుడూ గ్లామ‌ర్‌గా క‌నిపిస్తుంటుంది. కానీ ఆమె మాత్ర‌మే కాదు.. ఇత‌ర హీరోయిన్స్ ఫొటోల‌ను కూడా ఇలాగే కొంద‌రు మార్ఫింగ్ చేసి వైర‌ల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ విష‌యంలో ఆమె ఏకంగా మీడియా సంస్థ‌పైనే ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఇలాంటి ఫొటోల‌ను ఫొటోషాప్ చేసి.. వాటిని స‌ర్క్యులేట్ చేస్తున్నార‌ని.. ఇదేనా జ‌ర్న‌లిజం అంటే.. అని ఆమె ప్ర‌శ్నించింది. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment