Radhe Shyam : ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్‌.. రాధేశ్యామ్ విడుద‌ల తేదీ ఫిక్స్‌..!

February 2, 2022 11:09 AM

Radhe Shyam : రాధేశ్యామ్ మూవీ విడుద‌ల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్ష‌కులతోపాటు ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఆ చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. రాధేశ్యామ్ మూవీ విడుద‌ల తేదీని ఫిక్స్ చేశారు. ఈ మూవీని మార్చి 11వ తేదీన విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలోనే కొత్త విడుద‌ల తేదీతో కూడిన మూవీ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Radhe Shyam release date announced by makers
Radhe Shyam

మార్చి 11, 2022వ తేదీన ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ వార్ ఉంటుంద‌ని.. చెబుతూ మేక‌ర్స్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రాధేశ్యామ్ మూవీలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య‌గా క‌నిపించ‌నున్నాడు. ఇందులో ప్ర‌భాస్ ప్ర‌ముఖ హ‌స్త సాముద్రికుడిగా (పామిస్ట్‌) క‌నిపించ‌నున్నారు. ప్ర‌భాస్ ప‌క్క‌న హీరోయిన్‌గా పూజా హెగ్డె.. ప్రేర‌ణ పాత్ర‌లో న‌టించింది. యూర‌ప్‌లో సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు. రొమాంటిక్ డ్రామాగా ఈ మూవీ తెర‌కెక్కింది.

రాధేశ్యామ్ ఇప్ప‌టికే విడుద‌ల కావ‌ల్సి ఉండ‌గా.. అనేక మార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే థియేట‌ర్ల‌లో మార్చి 11వ తేదీన ఎట్ట‌కేల‌కు విడుద‌ల కానుంది. ఇక దీంతోపాటు ఆర్ఆర్ఆర్‌, భీమ్లా నాయ‌క్‌, ఆచార్య‌, ఎఫ్‌3, కేజీఎఫ్ 2, స‌ర్కారు వారి పాట వంటి చిత్రాలు రానున్న 3 నెల‌ల్లో విడుద‌ల కానున్నాయి. దీంతో ఈ వేస‌వి మొత్తం ప్రేక్ష‌కుల‌కు వినోదం ల‌భ్యం కానుంది.

రాధే శ్యామ్‌కు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించారు. వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌సీధ‌లు నిర్మించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment