Priyamani : వామ్మో.. ఊ అంటావా పాట‌లో స‌మంత‌ను చూస్తే.. ప్రియ‌మ‌ణికి అలా అనిపించింద‌ట‌..!

January 31, 2022 8:15 AM

Priyamani : పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల‌కు ఎంత పేరు వ‌చ్చిందో.. కేవ‌లం ఒక్క పాట చేయ‌డం ద్వారా స‌మంత‌కు కూడా అంతే పేరు వ‌చ్చింది. శ్రీ‌వ‌ల్లి సాంగ్‌తోపాటు స‌మంత ఊ అంటావా.. పాట కూడా పాపుల‌ర్ అయింది. ఇప్ప‌టికే స‌మంత పాట‌కు ఎంతో మంది డ్యాన్సులు చేశారు. అయితే ఈ పాట‌పై ప్రియ‌మ‌ణి తాజాగా స్పందించింది.

Priyamani said these words on samantha pushpa item song
Samantha Priyamani

ఊ అంటావా పాట‌లో స‌మంత‌ను చూస్తే తాను, త‌న భ‌ర్త‌కు ఆమె హాట్‌గా ఉంద‌ని అనిపించింద‌ని.. ప్రియ‌మ‌ణి తెలియ‌జేసింది. అయితే తామిద్ద‌రికే కాదు, ఎవ‌రికైనా ఆ పాట‌లో స‌మంత‌ను చూస్తే అలాగే అనిపించి ఉంటుంద‌ని ప్రియ‌మ‌ణి అభిప్రాయ ప‌డింది. స‌మంత ఆ పాట‌లో అద్భుతంగా చేసింద‌ని, గ‌తంలో ఆమె ఏ సినిమాలోనూ ఆ విధంగా చేయ‌లేద‌ని.. ప్రియ‌మ‌ణి కితాబిచ్చింది.

Priyamani : దేవిశ్రీ‌ప్రసాద్‌కు హ్యాట్సాఫ్..

ఇప్ప‌టికే చాలా మంది రోజూ ఊ అంటావా.. పాట‌ను వీక్షిస్తున్నార‌ని ప్రియ‌మ‌ణి తెలిపింది. అంత‌టి అద్భుత‌మైన సాంగ్‌ను కంపోజ్ చేసినందుకు దేవిశ్రీ‌ప్రసాద్‌కు హ్యాట్సాఫ్ అని తెలిపింది. ఈ పాట‌లో కొరియోగ్ర‌ఫీ కూడా అద్భుతంగా ఉంద‌ని, స‌మంత చాలా అందంగా, హాట్‌గా క‌నిపించింద‌ని చెప్పింది. కాగా ప్రియ‌మ‌ణి తాజాగా న‌టించిన భామాక‌లాపం సినిమా త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమ్ కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment