BSF Jobs : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 10వ‌త‌ర‌గ‌తి అర్హ‌త‌తో బీఎస్ఎఫ్‌లో ఉద్యోగావ‌కాశాలు..!

January 30, 2022 10:41 PM

BSF Jobs : ఉద్యోగం కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్న అభ్య‌ర్థుల‌కు శుభ‌వార్త‌. బీఎస్ఎఫ్‌లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల‌కు గాను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. మొత్తం 2788 పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు స‌ద‌రు మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. నిరుద్యోగ అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

BSF Jobs for unemployed youth 10th is eligibility

బార్డ‌ర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) లో ప‌నిచేయాల‌నే ఆస‌క్తి ఉన్న‌వారు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. మొత్తం 2788 పోస్టుల‌ను ఇందులో భాగంగా భ‌ర్తీ చేస్తారు. ఫిబ్ర‌వ‌రి 28, 2022వ తేదీని ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ‌కు ఆఖ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు వెంట‌నే ఆన్‌లైన్‌లో ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త ఉన్న‌వారు, సంబంధిత ట్రేడ్‌ల‌లో 2 ఏళ్ల డిప్లొమా చేసిన వారు ఈ ఉద్యోగాల‌కు అర్హులు. పురుషుతు 167.5 సెం.మీ., స్త్రీలు 157 సెం.మీ., ఎత్తు ఉండాలి. ఛాతి పురుషుల‌కు 78-83 సెం.మీ. ఉండాలి. షెడ్యూల్డ్ కులాలు, తెగ‌లు, గిరిజ‌నుల‌కు ఎత్తు పురుషుల‌కు 162.5, స్త్రీల‌కు ఎత్తు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఛాతి పురుషుల‌కు 76-81 ఉండాలి.

కొండ ప్రాంతాల అభ్య‌ర్థుల్లో పురుషుల‌కు ఎత్తు 165 సెం.మీ, స్త్రీల‌కు ఎత్తు 150 సెం.మీ. ఉండ‌వ‌చ్చు. 18 నుంచి 23 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న‌వారు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. వేత‌నం భారీగానే ల‌భిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment