Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న ద‌శ తిర‌గ‌నుందా ? బాలీవుడ్‌లో భారీ ఆఫ‌ర్‌..?

January 30, 2022 8:37 AM

Rashmika Mandanna : క‌న్న‌డ‌లో రిలీజ్ అయిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా ర‌ష్మిక మంద‌న్న సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది. ఆ త‌రువాత తెలుగులో ఛ‌లో అనే సినిమాలో న‌టించింది. ఆ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో.. ఇక ఆమె కెరీర్ మ‌లుపు తిరిగింది. త‌రువాత ఎన్నో సినిమాల్లో వ‌రుస‌గా అవ‌కాశాలు వ‌చ్చాయి. అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ర‌ష్మిక మంద‌న్న స్టార్ హీరోయిన్ క్ల‌బ్‌లోకి చేరుకుంది. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా కూడా మారింది.

Rashmika Mandanna reportedly got huge offer in Bollywood

గీత గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ వంటి హిట్ చిత్రాల‌తో ర‌ష్మిక మంద‌న్న గ్రాఫ్ అమాంతం పెరిగింది. తాజాగా పుష్ప సినిమాతో ఆమె కెరీర్ మ‌రింత ఎత్తుకు వెళ్లింది. దీంతో బాలీవుడ్‌లోనూ ఆమెకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో అనేక మంది ర‌ష్మిక మంద‌న్న‌తో సినిమా చేయాల‌ని ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. పుష్ప సినిమా ద్వారా వ‌చ్చిన గుర్తింపుతో ర‌ష్మిక మంద‌న్న ప్ర‌స్తుతం బిజీ అయిపోయింది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్ర‌కారం.. ర‌ష్మిక‌కు బాలీవుడ్‌లో ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌డైన క‌ర‌ణ్ జోహార్ ఆమెకు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ర‌ష్మిక ముంబైలో క‌ర‌ణ్ జోహార్ ఆఫీస్ వ‌ద్ద క‌నిపించింది. దీంతో ఆమె త‌దుపరి సినిమా కోసం చ‌ర్చించేందుకే అక్క‌డ‌కు వెళ్లింద‌ని, ఆమెకు స్క్రీన్ టెస్ట్ కూడా చేశార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌ర‌ణ్ జోహార్‌కు బాలీవుడ్‌లో ఉన్న పేరు దృష్ట్యా ఆమెకు భారీగానే ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని స‌మాచారం. ఓ అగ్ర‌హీరో సినిమాలో న‌టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

అయితే ర‌ష్మిక మంద‌న్న ఈ వార్త‌ల‌పై స్పందించ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని స‌మాచారం. అదే నిజ‌మైతే ర‌ష్మిక ద‌శ తిరిగిపోయింద‌నే చెప్పాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment