Pooja Hegde : పూజా హెగ్డెనా..? అయితే మాకొద్దు బాబోయ్‌.. అంటున్న నిర్మాత‌లు..?

January 29, 2022 6:34 PM

Pooja Hegde : హీరోయిన్ పూజా హెగ్డెకు గ‌త ఏడాది కాలం మొత్తం బాగా క‌ల‌సి వ‌చ్చింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ అమ్మ‌డు ఏ చిత్రంలో న‌టించినా అది బంప‌ర్ హిట్ అయింది. దీంతో దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌న్న చందంగా పూజా హెగ్డె ప్ర‌స్తుతం త‌న పారితోషికాన్ని అమాంతం పెంచేసింద‌ట‌. అయితే అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ప్ర‌స్తుతం ఈమెను హీరోయిన్‌గా తీసుకోవాలంటేనే నిర్మాత‌లు.. బాబోయ్ మాకొద్దు.. అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రి పూజాను వారు వ‌ద్ద‌ని చెప్ప‌డానికి గ‌ల కార‌ణాలు ఏమిటంటే..

producers reportedly not taking Pooja Hegde into their movies

పూజా హెగ్డె ఇటీవ‌లి కాలంలో న‌టించిన చిత్రాలు అన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌లు కావ‌డంతో ఈమె అమాంతం త‌న రెమ్యున‌రేష‌న్‌ను పెంచేసింది. అయితే అక్క‌డి వ‌ర‌కు ఓకే అయినా.. ఈమె సెట్‌కు వ‌చ్చిందంటే చాలు.. త‌న టీమ్ మొత్తం ఖ‌ర్చుల‌ను నిర్మాత‌పైనే వేస్తోంద‌ట‌. అవ‌స‌రం లేకపోయినా 12 మంది టీమ్‌ను సెట్‌కు తీసుకువ‌స్తోంద‌ట‌. వారి ఖ‌ర్చుల‌న్నింటినీ నిర్మాత‌లే భ‌రించాల్సి వ‌స్తోంద‌ట‌. దీంతో ఆమె డిమాండ్ల‌ను, ఖ‌ర్చును నిర్మాత‌లు భ‌రించ‌లేక‌.. ఆమె వ‌ద్దులే అని అనుకుంటున్నార‌ట‌.

పూజా హెగ్డె ఆ విధంగా చేస్తున్నందు వ‌ల్లే ప్ర‌స్తుతం ఆమె ఇంకా కొత్త సినిమాల‌కు సైన్ చేయ‌లేద‌ని తెలుస్తోంది. ఆమె న‌టించిన రాధే శ్యామ్‌, బీస్ట్ చిత్రాల షూటింగ్ పూర్త‌యింది. దీంతో ప్ర‌స్తుతం పూజా ఖాళీగానే ఉంటోంది. అయితే కొంద‌రు మీడియం బ‌డ్జెట్ నిర్మాత‌లు అంత‌కు ముందు పూజాతో సినిమాలు తీయాల‌ని అనుకున్నార‌ట‌. కానీ ఆమె డిమాండ్లు, ఆమె పెట్టిస్తున్న ఖ‌ర్చు చూసి వెనుక‌డుగు వేశార‌ట‌. లేదంటే ఈ అమ్మ‌డి చేతిలో నాలుగైదు సినిమాలు ఉండేవ‌ని అంటున్నారు. మ‌రి ఈమె రానున్న రోజుల్లో అయినా త‌న పంథాను మార్చుకుంటుందా.. సినిమా చాన్స్‌ల‌ను ద‌క్కించుకుంటుందా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment